ETV Bharat / international

డిసెంబర్​లోనే అందుబాటులోకి ఫైజర్​ వ్యాక్సిన్​! - pfizer vaccine latest news

తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్​కు ఫైజర్ దరఖాస్తు చేసింది. డిసెంబర్​ నుంచి పరిమిత సంఖ్యలో వ్యాక్సిన్​ వినియోగానికి అనుమతించాలని విజ్ఞప్తి చేసింది.

Pfizer
ఫైజర్​
author img

By

Published : Nov 20, 2020, 7:00 PM IST

అమెరికన్‌ దిగ్గజ ఫార్మా సంస్థ ఫైజర్‌ మరో కీలక ముందడుగు వేసింది. బయో ఎన్‌టెక్‌ సంస్థతో కలిసి కరోనా వ్యాక్సిన్‌ రూపొందిస్తున్న ఫైజర్‌ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ అమెరికా ఫుడ్‌ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్​డీఏ)కు దరఖాస్తు చేసింది. డిసెంబర్ ​ప్రారంభంలో పరిమిత సంఖ్యలో టీకా వినియోగానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

తమ వ్యాక్సిన్ ‌కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని ఫైజర్ ఇటీవలే ప్రకటించింది. అత్యవసర వినియోగానికి టీకా అర్హత సాధించాల్సి ఉందని.. అంతా సవ్యంగా సాగితే తుది పరీక్ష పూర్తి కావడానికి ముందే ఎఫ్​డీఏ అనుమతి మంజూరు చేస్తుందని ఆ సంస్థ‌ తెలిపింది.

పంపిణీయే ప్రధాన సవాలు..

టీకా వినియోగానికి సిద్ధంగా ఉంటే ఎఫ్​డీఏ దాని స్వతంత్ర సలహాదారులతో చర్చించి.. అనుమతి కోసం తదుపరి ప్రక్రియకు చర్యలు తీసుకుంటుంది. అమెరికన్లతో పాటు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్‌ను ఎలా పంపిణీ చేయాలనే అంశం సవాలుగా మారనుంది.

మార్చి నాటికి 9 కోట్ల డోసులు..

నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిసిన్‌కు సమర్పించిన సమాచారం ప్రకారం డిసెంబరులో 2.5 కోట్లు, జనవరిలో 3 కోట్లు, ఫిబ్రవరి- మార్చి నెలల్లో 3.5 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులోకి వస్తాయని ఫైజర్‌ వెల్లడించింది.

ఇదీ చూడండి: 'రెమ్​డెసివిర్​తో ఎలాంటి ప్రయోజనం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.