ETV Bharat / international

అమెరికాలోని భారతీయుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

అమెరికాలోని ఓ భారతీయుడికి 20ఏళ్ల జైలు శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. అతడి బృందం.. 2013-16 మధ్యకాలంలో కాల్​సెంటర్ల ద్వారా అమెరికన్లను బెదిరించి భారీగా నగదు దోచుకున్నట్లు విచారణలో తేలింది. బాధితులకు 89,70,396 డాలర్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Indian national gets 20-year jail for running call centers that defrauded US citizens
అమెరికాలోని భారతీయుడికి 20ఏళ్ల జైలు శిక్ష
author img

By

Published : Dec 1, 2020, 12:54 PM IST

భారత ఆధారిత కాల్​సెంటర్లకు నిధులు సమకూర్చడం సహా వాటి కార్యకలాపాల్లో పాల్గొని.. 2013-16 మధ్యకాలంలో అమెరికన్ల నుంచి మిలియన్​ డాలర్లు దోచుకున్న నేరం కింద ఓ భారతీయుడికి 20ఏళ్ల జైలు శిక్ష విధించింది అగ్రరాజ్య కోర్టు. విడుదల తర్వాత కూడా అతడి కదలికల్ని మూడేళ్ల పాటు పర్యవేక్షించాలని అదేశించింది.

టెక్సాస్​ దక్షిణ జిల్లా కోర్టు జడ్జి డేవిడ్​ హిట్నర్​.. అహ్మదాబాద్​కు చెందిన హితేశ్​ మధుభాయ్​ పటేల్​(44)కు శిక్ష ఖరారు చేశారు. మోసానికి కుట్ర పన్నడం, మనీలాండరింగ్​, ఫెడరల్​ అధికారిలా గుర్తింపు మార్చుకున్న అభియోగాలపై ఈ శిక్ష విధించారు. వీటితో పాటు బాధితులకు 89,70,396 డాలర్లు చెల్లించాలని ఆదేశించారు.

మోసం ఇలా..

అమెరికన్ల నుంచి డబ్బులు దోచుకునేందుకు పెద్ద ప్రణాళిక రచించారు పటేల్​, అతని సహచరులు. అహ్మదాబాద్​లోని తమ కాల్​ సెంటర్ల ఉద్యోగులతో అమెరికన్లకు ఫోన్లు చేయించేవారు. వారిని వారు ఐఆర్​ఎస్​, యూఎస్​సీఐసీ(యూఎస్​ పౌర-వలస సేవల) అధికారులుగా పరిచయం చేసుకునేవారు. బాధితులను అరెస్ట్​ చేస్తామని, జైలులో వేస్తామని, భారీగా జరిమానా విధిస్తామని బెదిరించేవారు. వాటి నుంచి తప్పించుకోవాలంటే.. తమకు కొంత నగదు చెల్లించాలని డిమాండ్​ చేసేవారు. పేమెంట్స్​ అందిన వెంటనే.. అమెరికాలోని తమ సహచరులతో వాటిని లిక్విడేట్​ చేసుకునేవారు. విచారణలో భాగంగా.. ఈ నేరాన్ని పటేల్​ అంగీకరించినట్టు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:- కొవిడ్ టీకాల​తో కొత్త కుంభకోణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.