ETV Bharat / international

ఇకపై హెచ్​-1బీ ఉద్యోగ వీసాల్లోనూ వారికే ప్రాధాన్యత! - హెచ్​-1బీ చట్టం

అమెరికాలోని ఇమ్మిగ్రేషన్​ వ్యవస్థలో భారీ సంస్కరణల కోసం కాంగ్రెస్​లో బిల్లును ప్రవేశపెట్టారు పలువురు చట్టసభ్యలు. అమెరికాలో చదువుకున్న విదేశీ సాంకేతిక నిపుణులకు.. హెచ్​-1బీ ఉద్యోగ వీసా కేటాయింపుల్లో ప్రాధాన్యం దక్కాలని బిల్లులో ప్రతిపాదించారు.

H-1B legislations introduced in Congress to give priority to US-educated foreign youths
వారి కోసం ఇమ్మిగ్రేషన్​ వ్యవస్థలో భారీ సంస్కరణలకు బిల్లు
author img

By

Published : May 23, 2020, 10:52 AM IST

వలసయేతర వీసా విధానాల్లో భారీ సంస్కరణల కోసం అమెరికా కాంగ్రెస్​లో బిల్లును ప్రవేశపెట్టింది ఓ చట్టసభ్యుల బృందం. హెచ్​-1బీ ఉద్యోగ వీసా కేటాయింపుల్లో.. అమెరికాలో చదువుకున్న విదేశీ సాంకేతిక నిపుణులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.

"హెచ్​-1బీ అండ్​ ఎల్​-1 రిఫార్మ్​ యాక్ట్​"ను ప్రతినిధుల సభలో బిల్​ పాస్చ్​రెల్​, పౌల్​ గోసర్​, రో ఖన్నా, ఫ్రాంక్​ పల్లోనె, లాన్స్​ గూడెన్​ ప్రవేశపట్టారు. సెనేట్​లో... చుక్​ గ్రాస్లే, డిక్​ డర్బిన్​లు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీనితో వార్షిక హెచ్​-1బీ వీసా కేటాయింపుల్లో తొలిసారిగా.. అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్​ సేవలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.

అమెరికాలో చదువుకుంటున్న నైపుణ్యం గల విద్యార్థులకు ప్రాధాన్యం దక్కేలా ఈ నూతన వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఉన్నత డిగ్రీ ఉన్నవారు, ఇప్పటికే వేతనాలు భారీగా అందుతున్న వారు, మంచి నైపుణ్యం ఉన్నవారికి కూడా ఈ వ్యవస్థతో లబ్ధిపొందాలని బిల్లులో ప్రతిపాదించారు.

నిబంధనలు అమలు చేయడం, వేతనాల్లో మర్పులు చేయడం, అమెరికా ఉద్యోగులు, వీసాదారుల రక్షణను పెంపొందించడం వల్ల హెచ్​-1బీ, ఎల్​-1 వీసా విధానాల ముఖ్య ఉద్దేశాన్ని కాంగ్రెస్​ తిరిగి అమలు చేసినట్టు అవుతుందని చట్టసభ్యులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా ఉద్యోగులను హెచ్​-1బీ, ఎల్​-1 వీసాదారులతో భర్తీ చేయడాన్ని ఈ చట్టం నిషేధిస్తుంది. హెచ్​-1బీ వర్కర్లను నియమించడం వల్ల అమెరికా ఉద్యోగుల పరిస్థితుల్లో పెద్దగా మార్పులు రావని చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా అవుట్​సోర్సింగ్​ కంపెనీలు.. హెచ్​-1బీ, ఎల్​-1 ఉద్యోగులను తాత్కాలిక శిక్షణ కోసం నియమించుకుని.. తిరిగి వారి సొంత దేశాలకు పంపించి వేయాలని ఈ చట్టంలో ప్రతిపాదించారు. ప్రత్యేకంగా ఈ చట్టం వల్ల 50కి మించిన ఉద్యోగులు ఉన్న కంపెనీలు.. (వీరిలో సగంమంది హెచ్​-1బీ, ఎల్​-1 ఉద్యోగాలు ఉన్నవారు) అదనంగా హెచ్​-1బీ ఉద్యోగులను నియమించుకోలేవు.

కొన్ని సంస్థలు ప్రోగ్రామ్​ను ఉపయోగించుకుని.. అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించి.. వారి స్థానాల్లో తక్కువ జీతాలతో ఉద్యోగులను నియమించుకుంటున్నాయని చట్టసభ్యుడు గ్రాస్లే ఆరోపించారు. అందుకే ఈ సంస్కరణలు ప్రతిపాదించినట్టు.. వీటి వల్ల అమెరికాలోని నైపుణ్యం ఉన్నవారికి లబ్ధి చేకూరుతుందన్నారు. అంతే కానీ వారిని భర్తీ చేయడం కోసం కాదని స్పష్టం చేశారు. ధ్వంసమైన ఇమ్మిగ్రేషన్​ వ్యవస్థను సరిచేయడానికి ఈ సంస్కరణలు అవసరమని చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.