కరోనా మహమ్మారి విజృంభణకు చైనానే కారణమని కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా మరోమారు చైనాపై తన అసంతృప్తిని వ్యక్తపరిచారు. ప్రస్తుత సమయంలో ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్తో మాట్లాడాలనుకోవట్లేదని స్పష్టం చేశారు.
" ప్రస్తుతం ఆయన (జిన్పింగ్)తో మాట్లాడాలనుకోవట్లేదు. ముందు ముందు ఏమి జరుగుతుందో చూద్దాం. వాణిజ్య ఒప్పందంపై వారు చాలా ఖర్చు చేస్తున్నారు."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
అంతకుముందు చైనాతో వాణిజ్యం ఒప్పందంపై మాట్లాడదలుచుకోలేదని పేర్కొన్నారు ట్రంప్. అమెరికా ఉత్పత్తులను చైనా భారీగా కొనుగోలు చేస్తోందన్నారు. కరోనా వైరస్ చైనా నుంచే వచ్చిందని, ఇతర దేశాలకు సంక్రమించకముందే దానిని అరికట్టాల్సిందని పునరుద్ఘాటించారు.