చైనా, రష్యా, భారత్ వంటి దేశాలు వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. తమ దేశంలో పర్యావరణ పరిరక్షణకు ఉత్తమ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
నార్త్ కరోలినాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్... చైనా, భారత్ వంటి దేశాలకు ఎక్కువ ప్రయోజనం కలుగుతున్నందునే పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగామని తెలిపారు.
" పారిస్ ఒప్పందం కోసం ట్రిలియన్ల డాలర్లను ఖర్చు చేయాల్సి వచ్చింది. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. చమురు, గ్యాస్, బొగ్గు వంటివి దారిమళ్లాయి. అందుకే పారిస్ ఒప్పందం నుుంచి వైదొలిగాను. నేను మీ అందరికి చెప్తూనే ఉన్నాను. నాకు స్వచ్ఛమైన గాలి అంటే చాలా ఇష్టం. కానీ, రష్యా, చైనా, భారత్ వంటి దేశాలు వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయి."
-- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ప్లాస్టిక్ స్థానంలో పేపర్ వస్తువులను వాడాలని వినిపిస్తున్న వాదనపై ట్రంప్ మండిపడ్డారు.
" స్ట్రాలను నిషేధించాలని అంటున్నారు. అయితే.. ప్లాస్టిక్ ప్లేట్లు, కార్టన్ల మాటేమిటి? గాజు వస్తువుల సంగతేంటి? "
-- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ప్రత్యర్థి జో బైడెన్ ప్రకటించిన ఇమ్మిగ్రేషన్ ప్లాన్ను ఎద్దేవా చేశారు ట్రంప్. అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన విధానమని అభివర్ణించారు.
ఇదీ చూడండి: మాస్క్లు ధరించే వారికే కరోనా: ట్రంప్