ఉగ్రవాదానికి మద్దతుగా నిలవటం, మతపరమైన విద్వేషాలు సృష్టించంటలో కొన్ని దేశాలను కొవిడ్-19 కూడా అడ్డుకోలేకపోయిందని ఐక్యరాజ్య సమితి వేదికగా వెల్లడించింది భారత్. ఈ సమస్యపై ఐరాస నిర్ణయాత్మకంగా మాట్లాడాలని, ఉగ్రవాదం ఏ విధంగా ఉన్నా సమర్థించకూడదని పాకిస్థాన్‌ను సూచిస్తూ స్పష్టం చేసింది.
వివిక్షను అరికట్టటంపై ప్రపంచ జెవిశ్ కాంగ్రెస్ నిర్వహించిన ఉన్నతస్థాయి వర్చువల్ సమావేశంలో భాగంగా ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ఈ మేరకు భారత వైఖరిని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా మత ప్రాతిపాదికన ఉన్న అన్ని రకాల వివక్షలను భారత్ ఖండిస్తుందని స్పష్టం చేశారు.
"ప్రస్తుతం మహమ్మారి మాటున కొన్ని దేశాలు మతప్రాతిపదికన విద్వేషాలను ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చేస్తున్నాయి. అమాయకపు ప్రజలను చంపటం, మత విద్వేషాలను సృష్టించేందుకు.. సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వకుండా వారిని కరోనా కూడా అడ్డుకోలేకపోయింది. ఆయా దేశాలు మత వివిక్ష, ద్వేషం, మత ప్రాతిపదికన ప్రపంచాన్ని విభజించాలనే ఆలోచనను మానుకోవాలి. వారి సొంత సమాజాల్లో సామరస్యాన్ని పెంపొందించడానికి, వివక్ష హింసను ఆపడానికి, మైనారిటీల రక్షణకు కృషి చేయాలని కోరుతున్నాం. "
- టీఎస్ తిరుమూర్తి, యూఎన్‌లో భారత శాశ్వత ప్రతినిధి.
ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాలకు నిలయం భారత్ అని, అనేక మతాలకు జన్మనిచ్చిన దేశమని స్పష్టం చేశారు తిరుమూర్తి. అందులో హిందూ, బౌద్ధ, సిక్కుం, జైనా వంటివి ఉన్నట్లు తెలిపారు. భారతీయ నాగరికత అని పిలిచే ఈ నదిలో ప్రతి విశ్వాసం, ప్రతి తెగ.. ప్రజాస్వామ్య నిర్మాణం, బహువచనం, సామరస్యం, పరస్పర అంగీకారం అనే చట్రంలో నుంచి పుట్టినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 'ఉగ్రవాదంపై ఆ దేశాలను బాధ్యులుగా చేయాలి'