ETV Bharat / international

మళ్లీ లక్షకుపైగా కేసులు- గవర్నర్లకు బైడెన్ హెచ్చరిక - america news upates

అమెరికాలో మరోసారి లక్షకుపైగా కొవిడ్​ కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో.. అధ్యక్షుడు బైడెన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్​ నియమాలకు అడ్డుతగులుతున్న కొందరు గవర్నర్లను హెచ్చరించారు.

biden, america president
బైడెన్, అమెరికా అధ్యక్షుడు
author img

By

Published : Aug 4, 2021, 10:43 AM IST

Updated : Aug 4, 2021, 11:48 AM IST

కొవిడ్​ డెల్టా వేరియంట్​ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. వ్యాక్సినేషన్​ నియమాలకు సహకరించని రిపబ్లికన్​ గవర్నర్లను 'అడ్డు తప్పుకోవాలి' అని హెచ్చరించారు. తాజాగా అమెరికాలో లక్షకుపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బైడెన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలంగా మారాయి.

ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, టెక్సాస్​ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ట్ సహా ఇతర అధికారులపై మండిపడ్డారు బైడెన్. కొవిడ్ డెల్టా వేరియంట్​ వ్యాప్తి నేపథ్యంలో.. టీకా తీసుకున్నా మాస్కులు ధరించాలని అమెరికా ఇచ్చిన ఆదేశాలను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్​ తీసుకోనివారు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో డెల్టా వ్యాప్తి తీవ్రమవుతోందని అన్నారు.

జిమ్​కు వెళ్లాలనుకునేవారు, రెస్టారెంట్లలో భోజనం చేయాలనుకునేవారు తప్పనిసరిగా వ్యాక్సిన్​ తీసుకోవాలని న్యూయార్క్​ సిటీ అధికార యంత్రాంగం తీసుకున్న నిర్ణయాన్ని బైడెన్ ఆమోదించారు. ఆఫీసుల్లోకి వెళ్లి పనిచేయాల్సిన ఉద్యోగులూ వ్యాక్సిన్​ తప్పనిసరిగా తీసుకోవాలని కార్పొరేట్​ సంస్థలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.

ఇదీ చదవండి:'టీకా ఉత్పత్తిలో భారత్​కు అమెరికా మద్దతు'

Last Updated : Aug 4, 2021, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.