కరోనా మహమ్మారితో(Corona virus) సతమతవుతున్న ప్రపంచాన్ని ప్రాణాంతక ఎబోలా వైరస్(ebola virus) కలవరపెడుతోంది. కొవిడ్ ఉద్ధృతి సమయంలో.. ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉండగా కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టింది. అయితే.. మరోమారు కేసులు నమోదవుతున్నాయి. ఎబోలా ఉద్ధృతికి అడ్డుకట్ట పడిందని ప్రకటించిన ఐదు నెలల తర్వాత తూర్పు కాంగోలో కొత్త కేసు(ebola virus in congo 2021) నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మూడేళ్ల చిన్నారిలో ఎబోలా లక్షణాలు(Ebola virus symptoms ) కనిపించిన క్రమంలో బెనిలోని బట్సిలి ఆసుపత్రికి తరలించగా.. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని, అక్టోబర్ 6న ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
" కొవిడ్ సహా ఈ ప్రాంతంలో అంటువ్యాధుల విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. అత్యంత సామర్థ్యం కలిగిన టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ నిరంతర నిఘా, సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. కాంగోలో ఎబోలా వైరస్ కట్టడిలో ఉన్న అపార అనుభవం.. కేసులను త్వరగా గుర్తించి వైద్యం అందించేందుకు ఉపయోగపడుతుంది. "
- జాసన్ కింద్రచుక్, వైరాలజిస్ట్, మనిటోబా వర్సిటీ కెనడా
ప్రస్తుతం నమోదైన కేసు 2020లోని ఎబోలా విజృంభణకు సంబంధించినదా? లేదా? అనేది తెలియదని అధికారులు పేర్కొన్నారు.
2018లో తూర్పు కాంగోలో ఎబోలా విజృంభణ(Ebola virus).. ప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్దది. సుమారు 2,300 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: మహమ్మారుల ముట్టడి.. పరిశోధనలతోనే అడ్డుకట్ట