ETV Bharat / international

ఘోర ప్రమాదం- ఆయిల్ ట్యాంకర్ పేలి 100 మంది మృతి

Sierra Leone oil tanker explosion
ఆయిల్ ట్యాంకర్ పేలి 100 మంది మృతి
author img

By

Published : Nov 6, 2021, 3:10 PM IST

Updated : Nov 6, 2021, 6:48 PM IST

15:09 November 06

ఆయిల్ ట్యాంకర్ పేలి 100 మంది మృతి

ఆయిల్ ట్యాంకర్ పేలి 100 మంది మృతి

ఆఫ్రికా దేశం సియెర్రా లియోన్​లో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని ఫ్రీటౌన్​లో ఆయిల్ ట్యాంకర్ పేలడం వల్ల 100 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ విపత్తు నిర్వహణ ఏజెన్సీ డైరెక్టర్ మొహమద్ లమ్రేన్ బా వెల్లడించారు. బాధితులకు చికిత్స కొనసాగుతోందని చెప్పారు. 

ఓ ఆయిల్ ట్యాంకర్.. గ్యాస్ స్టేషన్ వద్ద ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో కూడిన ఓ బస్సు వచ్చి ఆయిల్ ట్యాంకర్​ను ఢీ కొట్టింది. దీంతో ట్యాంకర్ నుంచి ఇంధనం లీక్ అయింది. దాన్ని సేకరించేందుకు చాలా మంది స్థానికులు గ్యాస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలోనే భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఫలితంగా అనేక మంది మరణించారు. 

ఫ్రీటౌన్ మేయర్ వోనే అకి సాయర్.. ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. వెల్లింగ్టన్ ప్రాంతంలోని బాయ్ బురెహ్ రోడ్​లో ఈ ప్రమాదం జరిగిందని ఫేస్​బుక్ పోస్ట్​లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

ఈ ఘటన పట్ల సియోర్రా లియోన్ అధ్యక్షుడు జులియస్ మాడ బయో.. విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన.. కాప్26 వాతావరణ సదస్సు కోసం స్కాట్​లాండ్​లో ఉన్నారు.

Last Updated : Nov 6, 2021, 6:48 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.