ETV Bharat / entertainment

టీవీలో వచ్చిన 8 నిమిషాల వీడియోతో.. ఆ ఫ్యామిలీలో 8 ఏళ్ల చీకట్లు మాయం! - etv show sridevi drama company

Sridevi Drama Company: ఆనందం ఆ ఇంటికి దూరమై రోజులు.. నెలలు.. సంవత్సరాలు గడిచాయి. మూడున్నరేళ్ల వయసులో తప్పిపోయిన కుమార్తె కోసం ఆ తల్లి వెతుకుతూనే ఉంది. వారి నిరీక్షణకు 8 ఏళ్లకు ప్రతిఫలం దక్కింది. అదీ ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవీ డ్రామా కంపెనీ కార్యక్రమం వల్లే. అంతే.. ఆ కుటుంబసభ్యుల ఆనందానికి ఇక అవధుల్లేవు. అసలేమైంది.. ఈ షో పాపను తల్లి దగ్గరకు ఎలా చేర్చింది?

Mother found her daughter after 8 years All this because of ETV Show Sridevi Drama Company!

author img

By

Published : Jun 28, 2022, 4:21 PM IST

Updated : Jun 28, 2022, 5:39 PM IST

8 ఏళ్ల తర్వాత తల్లి చెంతకు కుమార్తె

Sridevi Drama Company: కడుపుబ్బా నవ్వించే స్కిట్స్​.. అదిరిపోయే డ్యాన్స్​ పెర్ఫామెన్స్​లు.. అలరించే పాటలు.. హృదయాల్ని హత్తుకునే వాస్తవిక గాథలతో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది ఈటీవీలో ప్రసారమవుతున్న పాపులర్​ షో.. శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇటీవల ఈ కార్యక్రమం.. ఎప్పుడో చిరునవ్వు దూరమైన ఓ కుటుంబానికి.. మధురానుభూతిని మిగిల్చింది. ఎనిమిదేళ్ల కిందట తప్పిపోయిన ఓ కుమార్తెను.. తల్లి చెంతకు చేర్చింది. ఈ సన్నివేశం భాగ్యనగరంలో కనిపించింది.

హైదరాబాద్​.. ఈసీఐఎల్​లోని కమలానగర్‌లో ఉండే పిన్నమోని కృష్ణ, అనురాధ దంపతులకు నలుగురు ఆడపిల్లలు. వీరిలో ఇందూ 2014 సెప్టెంబరు 3న మూడున్నరేళ్ల వయసులో ఇంటి ముందు ఆడుకుంటూ తప్పిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కుషాయిగూడ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, యాదాద్రి జిల్లాల్లోని తెలిసిన అనాథాశ్రమాలన్నీ తిరిగారు. అలా ఆ తల్లి ఎనిమిదేళ్లుగా పాప కోసం వెతుకుతూనే ఉంది.

చివరకు ఇలా హ్యాపీహ్యాపీగా: ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీషోలో ఇటీవల తండ్రుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక స్కిట్‌ రూపొందించారు. అందులో కొందరు అనాథ పిల్లలు పాల్గొన్నారు. టీవీలో ఆ షో చూస్తున్న సమయంలో ఓ పాప అనురాధ దృష్టిని ఆకర్షించింది. తన కుమార్తెలానే ఉందని భావించి తెలిసిన వారి ద్వారా ఆరా తీశారు. రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ కమిటీ, అధికారుల సాయంతో భాగ్యనగర శివారులోని కిస్మత్‌పురాలోని అనాథ పిల్లల బాలికల సంరక్షణ కేంద్రంలో పాప ఉందని తెలుసుకున్నారు. వెంటనే అక్కడి చేరుకున్నారు.

Mother found her daughter after 8 years All this because of ETV Show Sridevi Drama Company!
తల్లిదండ్రులకు చిన్నారిని అప్పగిస్తున్న అధికారులు

ఆ మాతృమూర్తి నిరీక్షణ ఎట్టకేలకు 8 సంవత్సరాలకు ఫలించింది. ఇన్నేళ్ల వెతుకులాటకు ప్రతిఫలం దక్కింది. టీవీలో చూసింది తన కుమార్తె అని తెలిసింది. తమ బిడ్డను అలా చూసి.. ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యారు. వారి నుంచి సమగ్రంగా ఆధారాలు సేకరించి నిర్ధరించుకున్న అధికారులు.. హైదరాబాద్‌ మధురానగర్‌లోని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం తల్లిదండ్రులకు పాపను అప్పగించారు. కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జేడీ(అడ్మిన్‌) సునంద, ఆర్జేడీ శారద పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ఎన్నో ఆడిషన్స్​.. మరెన్నో అవమానాలు.. కానీ ఆ ఒక్క పాత్రతో లైఫ్​ టర్న్​!

నాన్​స్టాప్ పంచులు.. కంటతడి పెట్టించే ఎమోషన్

నా పెళ్లి ఆమెతోనే.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన సుడిగాలి సుధీర్

Last Updated : Jun 28, 2022, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.