ETV Bharat / entertainment

'మా బంధం ఏంటో చెప్పను.. ఏదైనా జరగొచ్చు.. ఫేక్​ మాత్రం కాదు!' - జబర్దస్త్​ వర్ష ఇమ్మాన్యుయెల్​ లవ్​

Jabardasth Varsha: అందంతో, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్దస్త్​', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కామెడీ షోలతో మరింత ఫేమస్​ అయిన వర్ష.. తన కో-కంటెస్టంట్​ ఇమ్మూతో లవ్​ట్రాక్​పై పెదవి విప్పింది.

జబర్దస్త్​ వర్ష
జబర్దస్త్​ వర్ష ఇమ్మాన్యుయెల్​
author img

By

Published : Jun 8, 2022, 8:39 AM IST

జబర్దస్త్ వర్ష స్పెషల్​ ఇంటర్వ్యూ

Jabardasth Varsha: 'జబర్దస్త్' వేదికపై నటించే జోడీలకు బయట ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి జోడీల్లో ఒకటి ఇమ్మాన్యుయెల్‌- వర్ష. ఎన్నో ఎపిసోడ్స్, స్పెషల్ షోస్‌లో వీళ్లిద్దరి రొమాంటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరింది. పైగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఊహాగానాలు బయటకు వచ్చాయి. దానికి తోడు ఓ స్పెషల్ ఈవెంట్​లో ఇమ్మాన్యుయెల్- వర్షకు పెళ్లి కూడా చేసేయడం ఊహాగానాలకు మరింత ఊపునిచ్చింది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ తెగ వార్తలు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో ఈటీవీ భారత్​కు ఇచ్చిన స్పెషల్​ ఇంటర్వ్యూలో ఇమ్మూతో తన అనుబంధంపై వర్ష మాట్లాడింది.

జబర్దస్త్​ వర్ష
జబర్దస్త్​ వర్ష
jabardasth varsha
జబర్దస్త్​ వర్ష

" చెప్పాలంటే అనుకోకుండా నేను ఇమ్మాన్యుయెల్​ కలిశాం. కేవలం ఒక్క డైలాగ్​ కోసమే ఇమ్మూతో స్కిట్ చేశాను. ఆ తర్వాత మేమిద్దరం బాగా క్లోజ్​ అయ్యాం. అయితే అతడు నాకు కేవలం ఫ్రెండ్​ అని చెప్పలేను. అలా అని మా ఇద్దరి మధ్య రిలేషన్​ ఏంటనేది కూడా చెప్పలేను. అంతా బాగుంటే స్కిట్​లోనిదే బయట నిజం అవ్వవచ్చు.. ఏదైనా అవ్వొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్​ మన చేతిలో ఉండదు కదా. అతడికి నాపై చాలా గౌరవం ఉంది. నాకు కూడా అతడంటే చాలా అభిమానం."

- వర్ష, జబర్దస్త్​ నటి

"ప్రస్తుతం మా టీమ్​లో ఉన్న భాస్కర్​.. నాకొక టీచర్​ లాంటి వారు. తెలుగులో కొన్ని పదాలు నేను సరిగ్గా పలకలేను. వాటిని దగ్గరుండి నాకు నేర్పిస్తారు. నేను, భాస్కర్​, ఫైమా, ఇమ్మూ మేమంతా ఒక కుటుంబంలా ఉంటాం. ఏ ఒక్క ఎపిసోడ్​కైనా​ మా నలుగురిలో ఒక్కరు మిస్​ అయినా ఆ రోజంతా వారి గురించే మాట్లాడుకుంటాం.

అప్పుడంటే కంటెస్టంట్ల మధ్య పోటీ ఉండేది.. ఇప్పుడు మాత్రం టీమ్​ల మధ్య గట్టి పోటీ ఉంది. మరింత బాగా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తాం. కొన్ని సార్లు ఎమోషనల్​గా మాట్లాడతాం. కానీ చాలా మంది అవి టీఆర్​పీ కోసమే చేస్తామని అనుకుంటుంటారు. అయితే అన్నీ ఫేక్​ కాదు.. అలా అని అన్నీ నిజం కూడా కావు. మల్లెమాల సంస్థ అందరినీ ప్రోత్సహిస్తోంది. నాకైతే ప్రస్తుతం మూవీలు చేయాలని లేదు. ఇంకేదైనా డ్రీమ్​ ఉంటే వీరికే చెబుతా.. కానీ ఇంక్కెకడికీ వెళ్లను." అని వర్ష తన మనసులో మాటల్ని చెప్పింది.

jabardasth varsha
జబర్దస్త్​ వర్ష

ఇవీ చదవండి: భారీ ధరకు నయన్​-విఘ్నేశ్​ వెడ్డింగ్​ వీడియో రైట్స్​!

సమంత తగ్గట్లేదుగా.. మళ్లీ అలా - ​ కొత్త బాయ్​ఫ్రెండ్​తో అమీ జాక్సన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.