ETV Bharat / entertainment

Yash Ravi Teja : యశ్​ గురించి రవితేజ అలా అనేశారేంటి.. ఫ్యాన్స్​ గుస్సా! - రవితేజ టైగర్ నాగేశ్వరరావు

Yash Ravi Teja News : కన్నడ హీరో యశ్​పై మాస్​ మహారాజా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్​గా మారాయి. ఇంతకీ రవితేజ ఏం అన్నారంటే?

Yash Ravi Teja : యశ్​ గురించి రవితేజ అలా అనేశాడేంటి.. ఫ్యాన్స్​ గుస్సా!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 4:01 PM IST

Yash Ravi Teja News : టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజపై కన్నడ రాకింగ్ స్టార్ యశ్​ అభిమానులు హర్ట్ అవుతున్నారు. ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఫ్యాన్స్ హర్ట్​ అయ్యే రేంజ్​లో రవితేజ యశ్ గురించి ఏమన్నారు? అనేది తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే.. రవితేజ ప్రస్తుతం 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ ప్రమోషన్స్​లో ఫుల్ బిజీగా ఉన్నారు. నార్త్​లోనూ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఎందుకంటే రవితేజకు కెరీర్​లోనే ఇది తొలి పాన్ ఇండియా చిత్రమిది. ఈ క్రమంలోనే బాలీవుడ్​లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ రవితేజ బిజీగా గడుపుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఓ బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో రవితేజ పాల్గొని.. కొంతమంది సౌత్ సూపర్ స్టార్స్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని, అతను చాలా మంచి డాన్సర్ అని అన్నారు.ప్రభాస్​ డార్లింగ్ అని, రాజమౌళిలో విజన్ అంటే ఇష్టమని చెప్పారు. కన్నడ హీరో యశ్ గురించి చెప్పమని అడగగా.. "కేజియఫ్ చిత్రం మాత్రమే తాను చూశానని, అతడికి కేజీయఫ్​ లాంటి సినిమా పడటం లక్కీ అని" రవితేజ అన్నారు. అయితే ఈ కామెంట్స్​ యశ్ ఫ్యాన్స్​కు నచ్చలేదు. దీంతో నెట్టింట రవితేజపై యశ్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Tiger Nageswarrao Release Date : కాగా, 'టైగర్ నాగేశ్వరరావు' విషయానికి వస్తే.. స్టువర్ట్​పురం గజదొంగ టైగర్ నాగేశ్వరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రవితేజ గజదొంగ లుక్​లో కనిపించారు. బాలీవుడ్ హీరోయిన్ నుపూర్ సనన్ హీరోయిన్​గా నటించింది. వంశీ దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్​పై సినిమాను నిర్మించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న పాన్ ఇండియా లెవెల్​లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.

Balakrishna Vs Ravteja : బాలయ్య ఈ సారి ఆటను తనవైపు తిప్పేసుకుంటారా?

Ravi Teja Silpa shetty : మాస్ మహారాజాతో శిల్పాశెట్టి డ్యాన్స్​.. స్టెప్పులు అదిరిపోయాయి బాసూ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.