Vikram Trailer Telugu: కమల్‌హాసన్ అభిమానులకు రామ్‌చరణ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. 'విక్రమ్' సినిమా తెలుగు ట్రైలర్‌ను ఆయన సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే విడుదలైన తమిళం, హిందీ ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడా జాబితాలోకి ఈ ప్రచార చిత్రమూ చేరనుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కమల్ నటించిన గత చిత్రాలకు మించి 'విక్రమ్'పై అంచనాలు పెరుగుతున్నాయి. విజయ్‌సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు, సూర్య అతిథి పాత్ర పోషించడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు 'ఖైదీ', 'మాస్టర్' ఫేం లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు అనిరుధ్ స్వరాలందించారు. ఈ సినిమా జూన్ 3న విడుదలకానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని నటుడు నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ రిలీజ్ చేయనుంది.
మహేశ్ మూవీలో మరో హీరో!: 'అతడు', 'ఖలేజా' తర్వాత త్రివిక్రమ్- మహేశ్‌బాబు కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉందని, దాని కోసం దర్శకుడు మరో హీరోను ఎంపిక చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు సుశాంత్‌ను సంప్రదించినట్టు టాక్. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అల వైకుంఠపురములో' సుశాంత్ ముఖ్య భూమిక పోషించారు. ఆయన నటనను మెచ్చిన త్రివిక్రమ్ మరోసారి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారట. దీనిపై అధికారిక ప్రకటన లేదు.
![sushant in mahesh babu trivikram movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15339464_2.jpg)
మరోవైపు, నాని పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేశ్ సినిమాలో నాని కనిపించబోతున్నాడంటూ అంతా చర్చించుకుంటున్నారు. దాంతో ఈ సినిమా ట్విటర్ ట్రెండింగ్ జాబితాలో నిలిచింది. మరి ఈ ఇద్దరిలో ఎవరు నటిస్తారో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
![mahesh babu pooja hegde movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15339464_8.png)
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో మహేశ్ సరసన పూజాహెగ్డే సందడి చేయనుంది. సంగీత దర్శకుడిగా తమన్ ఎంపికయ్యారు. #SSMB28 వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ సినిమాకు 'పార్థు' అనే పేరు ప్రచారంలో ఉంది.
విక్రమ్ 'కోబ్రా' రిలీజ్ డేట్: చియాన్ విక్రమ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'కోబ్రా'. ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దాంతో పాటే రెండో టీజర్‌ను విడుదల చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ సినిమాలో విక్రమ్ దాదాపు 25 పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌తో పాటు టాలీవుడ్ నటుడు సత్యదేవ్ ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి: నన్ను క్షమించండి: జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్