ETV Bharat / entertainment

రౌడీ హీరో కొత్త సినిమా.. ఈ సారి పవర్​ ఫుల్​ పోలీస్​ ఆఫీసర్​గా.. దర్శకుడు ఎవరంటే? - పోలీస్ ఆఫీసర్​గా విజయ్​ దేవరకొండ

రౌడీ హీరో విజయ్​ దేవరకొండ తన కొత్త సినిమాను ప్రకటించారు. దానికి సంబంధించిన పోస్టర్​ను విడుదల చేశారు.

Vijay devarkonda
పవర్​ ఫుల్​ పోలీస్​ ఆఫీసర్​గా రౌడీ హీరో.. దర్శకుడు ఎవరంటే?
author img

By

Published : Jan 13, 2023, 8:03 PM IST

సెన్సేషనల్​ స్టార్, రౌడీ హీరో విజయ్​ దేవరకొండ కాంబినేషన్​లో ఓ సినిమా రానుందంటూ ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. ఇప్పుడా ప్రచారాన్ని నిజం చేస్తూ అధికార ప్రకటన వచ్చింది. #VD12 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుంది. దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేసింది. దీన్ని చూస్తుంటే విజయ్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్​గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పోస్టర్‌లో కనిపించే 'మీకు చెప్పేందుకు.. నేను ఎక్కడివాడినో నాకు తెలియదు' అనే కొటేషన్‌ ఆసక్తి రేకెత్తించేలా ఉంది. టైటిల్‌, నేపథ్యం, హీరోయిన్‌ తదితర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా గౌతమ్‌ గతేడాది ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అనివార్య కారణాల వల్ల ప్రకటనతోనే ఆగిపోయింది. దీంతో గౌతమ్‌.. చరణ్‌ స్థానంలో విజయ్‌ను తీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమవుతూ.. ప్రకటన రావడంతో.. రామ్‌చరణ్‌తో చేయాలనుకున్న కథనే విజయ్‌తో తీస్తున్నారా? విజయ్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు గౌతమ్‌ కొత్త కథ సిద్దం చేశారు? అనే అనుమానం సినీ అభిమానుల్లో మొదలైంది. కాగా, నాని హీరోగా గౌతమ్‌ గతంలో తెరకెక్కించిన 'జెర్సీ'కి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుదక్కడంతో ప్రేక్షకుల్లో ఆయనపై అంచనాలున్నాయి.

ఇదీ చూడండి: ఎన్టీఆర్‌ ఫ్యామిలీతో పోటీ.. సవాల్​గా తీసుకుని చేశా: రామ్ ​చరణ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.