Trisha Mansoor Ali Khan : హీరోయిన్ త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు మన్సూర్ అలీ ఖాన్.. ఎట్టకేలకు శుక్రవారం ఆమెకు క్షమాపణలు చెప్పారు. 'ఈ చారిత్రక యుద్ధం ముగిసింది. ప్రజలంతా ఎవరి పని వారు చేసుకోండి' అని మన్సూర్ అన్నారు. నిత్యవసర ధరల పెరుగుదల సమస్య కూడా ప్రజలకు గుర్తు చేశారు. అయితే ఈ వివాదం దేశవ్యాప్తంగా సంచలనమైంది. నటి త్రిషకు ఆయా ఇండస్ట్రీల నుంచి భారీగా మద్ధతు లభించింది. జాతీయ మహిళా కమిషన్.. తమిళనాడు డీజీపీకి మన్సూర్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై చెన్నై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సమన్లు జారీ చేశారు.
అసలు ఏం జరిగిందంటే.. నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ‘లియో’లో త్రిషతో ఓ సీన్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. "గతంలో ఎన్నో చిత్రాల్లో నేను రేప్ సీన్లలో నటించా. ‘లియో’లో ఆఫర్ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నా. కాకపోతే, అలాంటి సీన్ లేకపోవడం బాధగా అనిపించింది." అని మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే, ఈ వ్యాఖ్యలపై త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోనందుకు ఆనందంగా ఉందన్నారు. "మన్సూర్ అలీ ఖాన్ నా గురించి అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అతడి లాంటి క్రూరమైన వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోనందుకు సంతోషంగా ఉంది. నా ఫిల్మ్‌కెరీర్‌లో ఇలాంటి వారితో నటించకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటా. ఇలాంటి వారి వల్లే మానవాళికి చెడ్డపేరు వస్తోంది." అని త్రిష ట్వీట్ చేశారు. ఇక ఈ వివాదం పట్ల పలువురు సినీ ప్రముఖులు త్రిషకు మద్దతుగా నిచిచారు.
మన్సూర్ వివరణ.. అయితే తాను చేసిన వ్యాఖ్యల పట్ల వివరాణ ఇచ్చారు మన్సూర్. త్రిషపై తనకెంతో మంచి అభిప్రాయం ఉందన్నారు. ఆమెను గౌరవిస్తున్నానని చెప్పారు. తాను సరదాగా చెప్పిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందనుకోలేదన్నారు. నేను ఎవరినో, ఎలాంటి వాడినో అందరికీ తెలుసు.. అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
త్రిషపై అనుచిత వ్యాఖ్యలు- క్షమాపణలు చెప్పేది లేదన్న మన్సూర్- నటికి అండగా మెగాస్టార్!
Trisha Second Innings : త్రిష హ్యాట్రిక్ రికార్డు.. 40 ఏళ్లలోనూ తగ్గని క్రేజ్!