ETV Bharat / entertainment

త్రిష మరోసారి లవ్‌లో ఫెయిల్‌ అయ్యారా - త్రిష

నటి త్రిషకు వ్యక్తిగత జీవితంలో మరో ఎదురుదెబ్బ తగిలిందా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. ఇన్​స్టాగ్రామ్​లో ఆమె తాజాగా పెట్టిన ఓ పోస్టే అందుకు కారణం. అసలేం జరిగిందంటే.

herione trisha
herione trisha
author img

By

Published : Aug 21, 2022, 11:32 AM IST

Updated : Aug 21, 2022, 12:04 PM IST

Actress Trisha Insta Post: 'వర్షం'తో తెలుగు తెరకు పరిచయమై.. చిరంజీవి, వెంకటేశ్‌, నాగార్జున, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సరసన నటించి అందర్నీ మెప్పించారు త్రిష. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో వరుస ప్రాజెక్ట్‌లు చేసి అగ్ర కథానాయికగా రాణించిన ఆమె.. తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్​ సోషల్​మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

త్రిష
త్రిష

"విషపూరితమైన మనస్వత్తం కలిగిన వ్యక్తులు వాళ్లంతట వాళ్లే నీతో మాట్లాడటం మానేయడం ఎంతో సంతోషంగా ఉంది. దీన్ని చూస్తుంటే చెత్త దానంతటదే తొలగిపోయినట్లు ఉంది" అని త్రిష రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్లు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 'త్రిష మరోసారి ప్రేమలో విఫలమయ్యారా?', 'ఇంతకీ ఆమె ఎవర్ని ఉద్దేశిస్తూ ఈ పోస్టు పెట్టారు'.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

త్రిష
త్రిష ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​

ఇక, గతంలో కోలీవుడ్‌ సినీ నిర్మాత వరుణ్‌తో త్రిష ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబపెద్దల సమక్షంలో వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. ఏమైందో ఏమో తెలియదు కానీ పెళ్లి కాకముందే వీళ్లిద్దరూ విడిపోయారు. ఈ బ్రేకప్‌ నుంచి బయటపడిన తర్వాత టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్‌ హీరోతో ఆమె డేటింగ్‌లో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ బంధం కూడా మధ్యలోనే నిలిచిపోయింది.

ఇవీ చదవండి: ఆ సినిమా వల్లే సాయిపల్లవికి ఫిదా ఆఫర్​ వచ్చిందట

భయపడేది లేదు ఎదురొస్తే కొట్లాడటమే, బాయ్​కాట్​ గ్యాంగ్​కు విజయ్​ స్ట్రాంగ్​ రిప్లై

Last Updated : Aug 21, 2022, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.