ETV Bharat / entertainment

సరికొత్త ట్యూన్స్​తో అదరగొడుతున్న యువ సంగీత దర్శకులు.. ఒక్క ఛాన్స్​ ప్లీజ్​ అంటూ! - హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్​ డైరెక్టర్

ప్రస్తుతం సౌత్​ ఇండస్ట్రీ​లోని టాలీవుడ్​లో యంగ్​ మ్యూజిక్​ డైరెక్టర్లు హవా కొనసాగుతోంది. నిత్యం సరికొత్త ట్యూన్స్​తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ తమ సత్తా చాటుకుంటున్నారు. మరి వారి మ్యూజిక్​తో మ్యాజిక్​ చేస్తున్న ఆ యంగ్​ సంగీత దర్శకులెవరో ఇప్పుడు చూద్దాం.​

Tollywood Young Music Directors
టాలీవుడ్ యంగ్​ మ్యూజిక్​ డైరెక్టర్లు
author img

By

Published : Apr 9, 2023, 8:21 PM IST

తెలుగు సినిమాలోని ఒక్క పాట దశాబ్దాల నాటి ప్రతిష్టాత్మక ఆస్కార్ కల​ను నెరవేర్చింది. దీంతోనే అర్థం చేసుకోవచ్చు ఓ సినిమాకి సంగీతం ఎంత ప్రాణమో. మరి అలాంటి పాటలకు సంగీతం అందించే మ్యూజిక్​ డైరెక్టర్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్క్రీన్​ వెనక ఉండి సినిమాలో భాగం పంచుకునే వీరి ప్రభావం జనాలపై కచ్చితంగా ఉంటుంది. పెద్ద సినిమాలకు పెద్ద మ్యూజిక్​ డైరెక్టర్లు, చిన్న సినిమాలకు చిన్న మ్యూజిక్​ డైరెక్టర్లు అనే విషయం పక్కన పెడితే ఎవరి స్థాయికి తగ్గట్టు వారు స్వరాలను సమకూరుస్తూ మంచి విజయాలతో దూసుకుపోతున్నారు.

అయితే ఓ సినిమాకు కథ ఎంత ప్రాముఖ్యమో.. సంగీతం కూడా అంతే ముఖ్యం. ఒక చిత్రం హిట్​ అవ్వాలన్నా.. ఫ్లాప్​ కావాలన్నా స్టోరీతో పాటు మ్యూజిక్​, పాటల ప్రభావం కూడా ఆ సినిమాపై కచ్చితంగా ఉంటుంది. కేవలం సాంగ్స్ వల్లనే హిట్ అయిన సినిమాలు ఉన్నాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక తాజాగా రిలీజ్​ అవుతున్న పలు సినిమాల్లోనూ స్టోరీ ఎలా ఉన్నా.. అందులోని పాటలు, మ్యూజిక్​ ఆడియన్స్​ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇక వీటికి అద్భుతమైన మ్యుజిక్​తో పాటు బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​ను అందిస్తూ తమకంటూ ప్రత్యేకమైన క్రేజ్​ను​ సంపాదించుకుంటున్నారు కొందరు యువ సంగీత దర్శకులు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం సౌత్​ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరక్టర్స్ అనగానే టక్కున గుర్తుకువచ్చే పేర్లు.. మ్యూజిక్​ లెజెండ్​ ఇళయరాజా, ఎంఎం కీరవాణి, మణిశర్మ, ఏఆర్ రెహమాన్, కోటి, తమన్, దేవిశ్రీ ప్రసాద్, అనూప్ రూబెన్స్, మిక్కీ జె మేయర్, యువన్ శంకర్ రాజా, హరీశ్ జైరాజ్. వీరితో పాటు మరికొంత మంది టాప్​ సంగీత దర్శకులు కూడా చిత్రసీమలో ఉన్నారు. ఈ సీనియర్​ మ్యూజిక్​ కంపోజర్ల లిస్ట్​ను పక్కన పెడితే తమ యంగ్​ టాలెంట్​తో సరికొత్త ట్యూన్స్​ను సమకూరుస్తూ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు కొందరు కొత్త తరం యువ సంగీత దర్శకులు.

భీమ్స్ సిసిరోలియో!
వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో గురించి. ఇప్పటి వరకు అనేక బ్లాక్​బస్టర్​ ఆల్బమ్స్​కు సంగీతం అందించిన ఈయన.. తాజాగా చిన్న సినిమాగా చెప్పుకుంటున్న పెద్ద మూవీ 'బలగం'కు కూడా భీమ్సే అద్భుతమైన మ్యూజిక్​ను అందించారు. ఇక సినిమాలోని భీమ్స్​ సంగీతానికి కొందరు కంటతడి పెడుతుంటే మరికొందరు చిన్నాపెద్దా తేడా లేకుండా కాళ్లు కదుపుతున్నారు.

Tollywood Young Music Directors
భీమ్స్ సిసిరోలియో

లియోన్ జేమ్స్!
తాజాగా హీరో విశ్వక్ సేన్ నటించిన 'దాస్ కా ధమ్కీ' సినిమా విడుదలైంది. ఇందులోని పాటలు మ్యూజిక్ లవర్స్​ను కట్టిపడేశాయి. వీటికి సంగీతం సమకూర్చింది యువ సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్. 'పాగల్​, 'నెక్స్ట్​ ఏంటి' తదితర సినిమాలకు కూడా జేమ్స్​ సంగీతం అందించారు.

Tollywood Young Music Directors
లియోన్ జేమ్స్

రామ్​ మిరియాల!
ఇటీవల టాలీవుడ్​లో రామ్​ మిరియాల పేరు మారుమోగుతోంది. ఎందుకంటే సోలో సాంగ్స్​, ప్రైవేటు ఆల్బమ్​లకు పెట్టింది పేరు చౌరస్తా రామ్​. ఇటు మ్యూజిక్​ను అందించడమే కాకుండా సింగర్​ గానూ తెగ బిజీగా ఉన్నారు. సినిమాల్లో అక్కడక్కడ ఒకట్రెండు ట్యూన్స్​ను అందిస్తూ తన టాలెంట్​​ను చూపిస్తున్నారు. 'డీజే టిల్లు' టైటిల్ సాంగ్​తో పాటు మరికొన్ని పాటలు రామ్​ మిరియాలకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇక బలగం సినిమాతో లైమ్​లైట్​లోకి వచ్చారు కూడా.

Tollywood Young Music Directors
రామ్​ మిరియాల

హర్షవర్దన్ రామేశ్వర్!
మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'రావణాసుర' సినిమాలోని ఓ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇండోవెస్ట్రన్ ఫాస్ట్ బీట్​తో వచ్చిన ఈ పాటకు ప్రతిఒక్కరూ డ్యాన్స్​ చేయాల్సిందే. ఈ పాటను ట్యూన్​ చేసింది మ్యూజిక్​ డైరెక్టర్​ హర్షవర్దన్ రామేశ్వర్. బ్లాక్​బస్టర్​ 'అర్జున్​ రెడ్డి' సినిమాలో కూడా తన మ్యూజిక్​తో మ్యాజిక్​ చేశారు హర్ష.

Tollywood Young Music Directors
హర్షవర్దన్ రామేశ్వర్

సామ్​ సీఎస్​!
రీసెంట్​గా విడుదలైన పాన్ ఇండియా సినిమా 'మైఖేల్​'. ఈ మూవీ బాక్సాఫీస్​ వద్ద బోల్తాపడ్డా.. ఇందులోని మ్యూజిక్​ మాత్రం అందరికి నచ్చేసింది. దీనికి సంగీతం సమకూర్చింది సామ్ సీఎస్సే.

Tollywood Young Music Directors
సామ్​ సీఎస్

మహతి స్వర సాగర్​!
ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్. ఈయన కూడా ఇటీవలీ కాలంలో మ్యూజిక్​ కంపోజర్​గా మారారు. ఛలో, భీష్మ, మాస్ట్రో సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మహతి.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'భోళా శంకర్' చిత్రం కోసం పని చేస్తున్నారు.

Tollywood Young Music Directors
మహతి స్వర సాగర్

వీరే కాకుండా మరికొంత మంది కొత్త సంగీత దర్శకులు గొప్ప సంగీతాన్ని అందిస్తూ సీనియర్​ మ్యూజిక్​ డైరెక్టర్స్​తో పాటీ పడుతున్నారు. అయితే ప్రస్తుత దర్శకనిర్మాతలు వీరికి కూడా తమ సినిమాల్లో అవకాశం ఇస్తే మరిన్ని అద్భుతాలు సృష్టించి ఇండస్ట్రీ ఖ్యాతిని మరింత పెంచే అవకాశం ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.