ETV Bharat / entertainment

దిల్​రాజు 'డ్రీమ్​ ప్రాజెక్ట్' రివీల్​.. ఫేమస్​ టెక్నీషియన్స్​తో మూవీ.. త్వరలోనే బాలయ్యతో! - దిల్​రాజు గేమ్​ ఛేంజర్​

టాలీవుడ్​లో నిర్మాతగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న​ దిల్​రాజు.. తన డ్రీమ్​ ప్రాజెక్ట్​ను రివీల్​ చేశారు. ఫేమస్​ టెక్నీషియన్లతో ఆ చిత్రాన్ని ప్లాన్​ చేస్తున్నట్లు తెలిపారు. దాంతోపాటు బాలయ్యతో సినిమా తీయాలని ఉన్నట్లు చెప్పారు. ఆ సంగతులు మీకోసం..

tollywood producer dilraju dream project details and movie with balakrishna

author img

By

Published : Apr 5, 2023, 7:17 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌కు, ఆ సంస్థ అధినేత దిల్​రాజుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దిల్​రాజు కాంపౌండ్‌ నుంచి కొత్త సినిమా వస్తుందంటే.. హీరో, హీరోయిన్‌ ఎవరనేది చూడకుండా థియేటర్స్‌కు వస్తున్నారు సినీ ప్రియులు! డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ ప్రారంభించిన దిల్​ రాజు.. దిల్‌ సినిమాతో నిర్మాతగా మారారు. 20 ఏళ్ల క్రితం (2003, ఏప్రిల్‌ 4) దిల్‌ సినిమా విడుదలై ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఆ తర్వాత నుంచి వరుసగా తన సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్​పై సినిమాలు నిర్మిస్తూ కెరీర్​లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్​లను అందుకుని గోల్డెన్ లెగ్ నిర్మాతగా మంచి పేరు దక్కించుకున్నారు దిల్​ రాజు. 20 ఏళ్లతో 50 చిత్రాలను నిర్మించి అత్యధిక సక్సెస్‌ రేటు సాధించారు.

అయితే దిల్​రాజు.. ట్విట్టర్​లో ఫ్యాన్స్​తో తాజాగా చిట్​ చాట్​ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర ప్రశ్నలకు సమధానాలిచ్చారు. ముఖ్యంగా దిల్​రాజు తన డ్రీమ్​ ప్రాజెక్ట్​ గురించి వివరించారు. జటాయు పేరుతో భారీ సినిమా ప్లాన్​ చేస్తున్నట్లు తెలిపారు. అత్యుత్తమ సాంకేతిక సిబ్బంది, ఫేమస్​ నటీనటులతో సినిమాను తెరకెక్కించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్​ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. వెయింటింగ్​ అంటూ నెట్టింట ట్రెండ్​ చేస్తున్నారు.

రామ్​చరణ్​ హీరోగా తెరకెక్కిస్తున్న గేమ్​ఛేంజర్​ సినిమా.. ఫ్యాన్స్​తో పాటు అందరికీ నచ్చేలా ఉంటుందని తెలిపారు. మరో ప్రశ్నలో నటసింహం బాలకృష్ణతో సినిమా తీయాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రభాస్​, ఎన్టీఆర్​, నాని, రవితేజ, యశ్​లతో చిత్రాలను భవిష్యత్తులో తీయబోతున్నట్లు హింట్​ ఇచ్చారు. తనకు బొమ్మరిల్లు చిత్రం అంటే చాలా ఇష్టమని తెలిపారు. శాకుంతలం చిత్రంలో సమంత అద్భుతంగా నటించినట్లు చెప్పారు.

టాలీవుడ్​ సినీ ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులను పరిచయం చేశారు దిల్​రాజు. 2004లో ఆర్య సినిమాతో సుకుమార్‌ను పరిచయం చేశారు. 2006లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాతోనే భాస్కర్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మున్నా సినిమాతో వంశీ పైడిపల్లిని, కొత్త బంగారులోకం సినిమా ద్వారా శ్రీకాంత్ అడ్డాలను టాలీవుడ్‌కు అందించారు.

వారిసు చిత్రంతో కోలీవుడ్​లోనూ ఎంట్రీ ఇచ్చారు దిల్​రాజు. విజయ్‌ హీరోగా నటించిన ఆ చిత్రం.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై హిట్‌ కొట్టింది. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా పాన్‌ ఇండియా సినిమాను నిర్మిస్తున్నారు. 20 ఏళ్ల జర్నీలో దిల్​రాజు ఎన్నో అవార్డులను పొందారు. శతమానం భవతితో జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. బలగంతో అంతర్జాతీయ అవార్డును గెలుచుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.