ETV Bharat / entertainment

చరణ్​​​-బన్నీ​ మల్టీస్టారర్​ ప్రాజెక్ట్​.. ఆ దర్శకుడితో అల్లుఅరవింద్ చర్చలు - అల్లుఅర్జున్​ రామ్​చరణ్​ సినిమా

రామ్​చరణ్​-అల్లుఅర్జున్​ కాంబోలో మల్టీస్టారర్​ తెరకెక్కించే దిశగా నిర్మాత అల్లుఅరవింద్​ ప్రయత్నాలు ప్రారంభించిన్నట్లు ప్రచారం సాగుతోంది. ఓ ప్రముఖ దర్శకుడితో చర్చలు జరుపుతున్నారట! ఆ సంగతులు..

Charan Arjun project
చరణ్​​​-బన్నీ​ మల్టీస్టారర్​ ప్రాజెక్ట్​
author img

By

Published : Oct 25, 2022, 11:00 AM IST

ఇటీవల ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్​.. మెగాఅల్లు ఫ్యాన్స్​కు తీపికబురు వినిపించిన సంగతి తెలిసిందే. రామ్​చరణ్​-అల్లుఅర్జున్​తో ఓ మల్టీస్టారర్​ చేయాలని, దానికి చరణ్​-అర్జున్​ అనే టైటిల్​ కూడా ఫిక్స్​ చేసినట్లు.. తన మనసులోని మాటను బయటపెట్టారు. సరైన కథ, దర్శకుడు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడా ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చబోతున్నట్లు తెలుస్తోంది. అల్లుఅరవింద్​ ప్రస్తుతం ఆ పనిమీదే దృష్టి పెట్టినట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రాజెక్ట్​ కోసం ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్​ను లైన్​లో పెట్టారని తెలిసింది. ఆయనతో చర్చలు జరుపుతున్నారట.

అయితే ప్రస్తుతం త్రివిక్రమ్​.. సూపర్​స్టార్​ మహేశ్​బాబుతో 'ఎస్​ఎస్​ఎమ్​బీ 28' చేస్తున్నారు. ఇది పూర్తవ్వగానే అల్లుఅర్జున్​తో చేయాలని భావిస్తున్నారట. అయితే ఈ కథనే మల్టీస్టారర్​గా డెవలప్​ చేయాలని అల్లుఅరవింద్​ అడిగినట్లు కథనాలు వస్తున్నాయి. దీనిపై ఎటువంటి అధికార ప్రకటన లేదు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్​కు పండగే.

కాగా, ఇటీవలే ఆర్​ఆర్​ఆర్​తో భారీ హిట్​ను అందుకున్న రామ్​చరణ్​.. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శంకర్​ డైరెక్షన్​లో రూపొందుతున్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న​ ఆర్​సీ 15లో నటిస్తున్నారు. ఇక అల్లుఅర్జున్ విషయానికొస్తే.. 'పుష్ప'తో సక్సెస్​తో పాన్​ ఇండియా స్టార్​గా మారిపోయిన ఆయన.. పుష్ప 2 కోసం సన్నద్ధమవుతున్నారు. అలానే కొత్త కథలు వింటూ తన తదుపరి సినిమాలను లైన్​లో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదీ చూడండి: అల్లుఅర్జున్​-రామ్​చరణ్​ కాంబోలో మల్టీస్టారర్.. టైటిల్ ఫిక్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.