ETV Bharat / entertainment

'ది లయన్ కింగ్'కు ప్రీక్వెల్​.. 'మహా భారతం' ఎప్పుడంటే? - మహా భారతం సినిమా అప్డేట్​ ఇచ్చిన నిర్మాతలు

ఎంతగానో అలరించిన 'ది లయన్ కింగ్' సినిమాకు త్వరలో ప్రీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ స్టూడియోస్ వెల్లడించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'మహా భారతం' అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. నాగశౌర్య నటించిన 'కృష్ణ వ్రింద విహారి' ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

prequel to The Lion King
The Lion King prequel Mufasa: The Lion King gets release date
author img

By

Published : Sep 10, 2022, 6:55 PM IST

The Lion King Prequel Announced : ఎంతగానో అలరించిన 'ది లయన్ కింగ్' సినిమాకు త్వరలో 'ముఫాసా : ది లయన్ కింగ్' అనే ప్రీక్వెల్ రానుంది. ఆస్కార్ అవార్డు పొందిన దర్శకుడు బేరీ జెంకిన్స్.. ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో ముఫాసా తన తమ్ముడు స్కార్​తో కలిసి చిన్న తనాన్ని ఎలా గడిపాడో అనే కథను వివరిస్తాడు.

ఈ సినిమా ప్రివ్యూను డీ23 ఎక్స్​పోలో ప్రదర్శించారు. ఒక అనాధ ముఫాసా.. రాజులా ఎలా ఎదిగాడు అని వివరించారు. ఇందులో ముఫాసాను చిన్నప్పటి పాత్రలో.. ఎడారి ప్రాంతాల్లో చూపించారు. ఈ ప్రివ్యూలో టిమోన్​ పాత్ర కూడా నవ్వులు పూయించింది. ఇందులో ముఫాసా, స్కార్​ చిన్నప్పటి పాత్రలకు ఆరోన్​ పెర్రీ, కెల్విన్​ హారిసన్ గాత్రం అందించనున్నారు. 1994లో విడుదలైన ఒరిజినల్​ వెర్షన్​లో, 2019లో విడుదలైన రీమేక్​లోనూ ముఫాసాగా జేమ్స్​ ఏర్ల్​ జోన్స్​, స్కార్​గా జెరెమీ ఐరాన్స్, చివెటెల్​​ ఎజిఫోర్​ తమ గాత్రం అందించారు. అయితే ఈ సినిమా రిలీజ్​ డేట్​ మాత్రం వెల్లడించలేదు.

'మహా భారతం' అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది
'మహాభారతం' ప్రాజెక్ట్‌ సిద్ధం చేయనున్నట్లు టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ గతంలో ఓసారి వెల్లడించిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌ నిర్మాత మధు మంతెనతో కలసి ఈ ప్రాజెక్ట్‌ చేయనున్నట్లు ఆయన చెప్పారు. కాగా, తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొత్త అప్‌డేట్‌ బయటకు వచ్చింది. మహాభారతాన్ని సినిమాలా కాకుండా వెబ్‌సిరీస్‌ రూపంలో నిర్మించనున్నారు. డిస్నీప్లస్‌ హాట్‌ స్టార్‌ వేదికగా దీన్ని విడుదల చేయనున్నారు.

"ఇక గొప్ప ఇతిహాసం.. మునుపెన్నడూ చూడని విధంగా మీ ముందుకు రానుంది. ఒక అద్భుత దృశ్య కావ్యం కోసం ఎదురుచూస్తూ ఉండండి" అని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ పేర్కొంది. అయితే ఈ సిరీస్‌లో ఎవరు నటిస్తున్నారు? దీన్ని ఎవరు తెరకెక్కిస్తున్నారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది. అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మైధోవర్స్ స్టూడియోస్ సంయుక్తంగా దీన్ని రూపొందిస్తున్నాయి.

'కృష్ణ వ్రింద విహారి' ట్రైలర్‌ విడుదల
'ప్రతి సినిమా ముకేశ్‌ యాడ్‌తో మొదలైనట్లు.. ఈ సినిమా సత్య అనే డాక్టర్‌తో మొదలవుతుంది' అంటున్నారు నాగశౌర్య. ఆయన హీరోగా నటించిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'కృష్ణ వ్రింద విహారి'. అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకుడు. ఉషా ముల్పూరి నిర్మించారు. షిర్లీ సేథియా కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం ట్రైలర్‌ విడుదల చేశారు.

యువతను ఆకట్టుకునేలా అన్ని అంశాలను జోడించి, ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. "కొత్తదనం నిండిన రొమాంటిక్‌ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. నాగశౌర్య, షిర్లీ కెమిస్ట్రీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది" అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో రాధిక, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మహతి స్వర సాగర్‌ సంగీతమందించారు. సాయి శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: విక్రమ్@100 రోజులు.. కమల్​ వాయిస్​ ట్వీట్​ వైరల్​!

పింక్​ సూట్​లో యాంకర్ శ్రీముఖి హాట్​ ఫొటోషూట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.