సరోగసీ నేపథ్యంలో సమంత నటించిన లేటెస్ట్ చిత్రం 'యశోద'. ఈ సినిమా గత 10 రోజుల నుంచి థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సరోగసీ బ్యాక్‌డ్రాప్‌తో థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో హీరోయిన్ సమంత లీడ్ రోల్ పోషించగా.. పాన్ ఇండియా మూవీగా ఈ నెల 11న రిలీజైంది. 'మయోసైటిస్' అనే కండరాల వ్యాధికి చికిత్స తీసుకుంటూనే సమంత చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచాయి. స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గని రేంజ్‌లో సమంత ఈ మూవీలో ఫైట్స్ చేసింది.
యశోద సినిమాలో యాక్షన్ సీన్స్‌ను ఎలా చిత్రీకరించారు? సమంత ఆ సీన్స్ చేసే ముందు ఎలాంటి కసరత్తులు చేసింది? వాటిని ఆమె ఆస్వాదించిన తీరును వివరిస్తూ ఓ వీడియోను యశోద టీమ్ తాజాగా రిలీజ్ చేసింది. రోప్ సాయం లేకుండా కొన్ని సీన్స్ చేసినట్లు కనిపించిన సమంత.. ఫైట్ సీన్స్‌లోనూ డూప్ లేకుండా నటించింది. ఓ ఫైట్ సీన్‌లో చెంపపై పంచ్ పడటంతో అరగంట వరకు కోలుకోలేకపోయినట్లు సమంత చెప్పుకొచ్చింది. చెంప బూరెలా ఉబ్బిందని కూడా సమంత గుర్తు చేసుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
యశోద మూవీ హరి-హరీష్ దర్శకత్వంలో తెరకెక్కగా.. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే దాదాపు రూ.30 కోట్ల వరకు వసూలు చేసిన యశోద మూవీ.. డిసెంబరు రెండో వారంలో ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను భారీ ధరకు కొనుగోలు చేసింది. యశోద సినిమాకు సీక్వెల్ ఉంటుందా? అని ఇటీవల దర్శకులు హరి-హరీష్‌ను ప్రశ్నించగా.. సమంత ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆమె ఒప్పుకుంటే సీక్వెల్ కూడా చేస్తామని స్పష్టం చేశారు.
కాగా, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నీ ముకుందన్ కీలకపాత్రల్లో నటించారు. శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మణిశర్మ సంగీతం అందించాడు.
ఇదీ చదవండి: బడ్జెట్ విషయంలో నిర్మాతలు తగ్గేదేలే.. పాటకే రూ.15 కోట్లు.. మోడల్ కార్ల తయారీ