ETV Bharat / entertainment

Telugu Upcoming Movies : ఈ స్టార్​ హీరోల రూటే సపరేటు.. అందరూ అలాంటి కథలతోనే! - జూ ఎన్​టీఆర్ దేవర అప్​డేట్

Telugu Upcoming Movies : టాలీవుడ్​లో ప్రస్తుతం సముద్ర తీర ప్రాంతాల్లో సినిమాలు తీయడం ట్రెండ్​గా మారింది. ఈ క్రమంలో తెలుగు అగ్ర కథానాయకులు కూడా సముద్ర నేపథ్యం ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Telugu Upcoming Movies
Telugu Upcoming Movies
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 7:55 AM IST

Updated : Sep 10, 2023, 8:50 AM IST

Telugu Upcoming Movies : సినిమాలకు సముద్రాలకు మంచి అనుబంధం ఉంటుంది. ప్రేమకథలు, పోరాట కథలతో బీభత్సం సృష్టించాలన్నా.. దర్శక నిర్మాతల మొదటి ఎంపిక సముద్ర తీరం. వీలైతే అందుబాటులో ఉన్న విశాఖ, కాకినాడ లేదా ముంబయి, గోవా, కోల్‌కతా తీరాల వైపు ఓ లుక్కేస్తారు. ఇక కథతో ఎలాంటి సంబంధం లేకున్నా కూడా.. స్క్రీన్ అట్రాక్షన్​ కోసంమో, పాట కోసమె, యాక్షన్ సన్నివేశం కోసమో సముద్ర సముద్ర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతుంటారు మన దర్శకులు. అయితే ఇప్పుడు తెలుగులో కొందరు హీరోలు.. పూర్తిగా సముద్ర ప్రాతం నేపథ్యంలో సాగే సినిమాలతో ముందుకు వస్తున్నారు. వారెవరు? ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

దేవర..
జూ. ఎన్​టీఆర్​ 'ఆర్​ఆర్​ఆర్​' సినిమాతో పాన్ఇండియా స్టార్​గా ఎదిగారు. అయితే ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా చేస్తున్నారు. ఈ కథ పూర్తిగా తీర ప్రాంత నేపథ్యంలో సాగుతుంది. భయంకరమైన మృగాలకు భయాన్ని పరిచయం చేసేందుకు హీరో ఏం చేశాడన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ క్రమంలో దర్శకుడు.. సముద్రానికి, దాని నేపథ్యంలో వచ్చే యాక్షన్‌ సన్నివేశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తారక్​తో నీటి లోపలో సీన్స్​ ఉండనున్నాయట. ఈ యాక్షన్ సీక్వెల్స్​ కోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారట. బాలీవుడ్ బ్యూటీ.. జాన్వీ కపూర్‌ ఈ సినిమాలో హీరోయిన్​గా నటిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న సినిమా రిలీజ్ కానుంది.

ఓజీ.. ఒరిజినల్ గ్యాంగ్​స్టర్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్-సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్​స్టర్)'. అయితే ఈ కథ ముంబయి పోర్టు కేంద్రంగా సాగనుంది. సినిమాలో పవన్.. పవర్​ఫుల్ గ్యాంగ్‌స్టర్‌ లుక్​లో​ కనిపించనున్నారు. ఇక పవన్‌ సరసన ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్‌ హష్మీ, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

నాగచైతన్య-చందూ మొండేటి సినిమా..
అక్కినేని నాగ నాగచైతన్య.. డైరెక్టర్ చందూ మొండేటి కలయికలో ఓ సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా సముద్రం బ్యాక్​డ్రాప్​లో సాగనుంది. మత్స్యకారుల జీవితాలను కళ్లకు కట్టే ఓ కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. 2018 లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన కొంతమంది మత్స్యకారులు.. గుజరాత్ తీరంలో చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్‌ కోస్టు గార్డులకు చిక్కారు. వీరు అక్కడ ఏడాదికిపైగా జైళ్లో గడిపారు. ఈ యథార్థ సంఘటనలకు దర్శకుడు చందూ.. ఓ ప్రేమ కథతో సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా.. త్వరలోనే షూటింగ్ జరుపుకోనుంది.

ఆర్​సీ 16!
దర్శకుడు బుచ్చిబాబు సాన.. తొలి సినిమా 'ఉప్పెన'తో జాతీయ అవార్డు అందుకున్నారు. ఆయన రెండో సినిమా మెగా హీరో రామ్‌చరణ్‌తో చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే ఓ కథ సిద్ధం చేసినట్లు బుచ్చిబాబు తెలిపారు. అయితే ఈ సినిమా కూడా ఉప్పెన సినిమా వలె తీర ప్రాంతంలో సాగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా డిసెంబరు, జనవరి మధ్యలో సెట్స్​పైకి వెళ్లనుంది.

The Vaccine War First Look : 'వ్యాక్సిన్​ వార్'​ ఫస్ట్​ లుక్​ పోస్టర్​.. రియలిస్టిక్ లొకేషన్స్​లో షూటింగ్​..

National Film Awards 2021 List : జాతీయ ఉత్తమ చిత్రంగా రాకెట్రీ.. నేషనల్​ అవార్డ్ విన్నర్స్ ఫుల్ లిస్ట్ ఇదే..

Last Updated : Sep 10, 2023, 8:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.