ETV Bharat / entertainment

'మా పని మనిషితోనే స్టెరాయిడ్స్​ ఇప్పించారు.. బాలీవుడ్ మాఫియా వేధిస్తోంది' - తనూశ్రీ దత్తా బాలీవుడ్​ మాఫియా

Tanushree Dutta Bollywood: కొంతమంది వ్యక్తులు తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారని.. దీని వెనుక బాలీవుడ్ మాఫియా ఉందని హీరోయిన్ తనుశ్రీ దత్తా సంచలన ఆరోపణలు చేశారు. ఎవరైనా సరే, ఏదో ఒకటి చేసి తనకు సాయం చేయాలంటూ తాజాగా ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు.

tanushree-dutta comments
tanushree-dutta comments
author img

By

Published : Jul 24, 2022, 6:56 AM IST

Tanushree Dutta Bollywood Mafia: బాలీవుడ్‌ మాఫియా తనని వేధిస్తుందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా. గతంలో మీటూ వేధింపులపై గళం విప్పిన ఆమె ఇటీవల ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. కొంతమంది తనను టార్గెట్‌ చేసి మరీ వేధిస్తున్నారని సాయం కావాలంటూ ఆమె వేడుకున్నారు.

"కొంతమంది వ్యక్తులు నన్ను టార్గెట్‌ చేసి విపరీతంగా వేధిస్తున్నారు. దయచేసి ఎవరైనా, ఏదో ఒకటి చేసి నాకు సాయం చేయండి..!! గతంలో ఏడాది పాటు నా సినిమాలు ఆడకుండా చేశారు. మా పనిమనిషితో కుమ్మక్కై తాగే నీటిలో స్టెరాయిడ్స్‌, కొన్నిరకాల మందులు కలిపి నాకు అందించేలా చేశారు. దానివల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నా. ఇవన్నీ తట్టుకోలేక మే నెలలో ఉజ్జయిని పారిపోయా. అక్కడ నా బైక్‌ బ్రేకులు తీసేసి రెండుసార్లు ప్రమాదాలకు గురి చేశారు. ధైర్యంతో చావు నుంచి బయటపడి మళ్లీ సాధారణ జీవితం కోసం 40 రోజుల తర్వాత తిరిగి ముంబయికి వచ్చా. ఇవన్నీ చూసి భయంతో ఆత్మహత్య చేసుకోను. ఎక్కడికి పారిపోను. నా కెరీర్‌ని తిరిగి నిర్మించుకునేందుకు ఇక్కడే ఉండి కష్టపడతా. బాలీవుడ్‌ మాఫియా ఇదంతా చేస్తోంది. మీటూ వేదికగా నేను ఎవరిపైనైతే ఆరోపణలు చేశానో, అప్పట్లో నేను ఏ ఎన్‌జీవోని అయితే నిందించానో వారే ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నారని నాకు తెలుసు. ఎందుకంటే నన్ను టార్గెట్‌ చేయడం వల్ల వేరేవాళ్లకి ఏం లాభం?" అని తనుశ్రీ దత్తా రాసుకొచ్చారు.

tanushree-dutta comments
తనుశ్రీ దత్తా

2005లో విడుదలైన 'ఆషిక్ బనాయా ఆప్నే' సినిమాతో తనుశ్రీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో ఆమె హిందీతోపాటు దక్షిణాదిలోనూ పలు సినిమాల కోసం వర్క్‌ చేశారు. బాలయ్య నటించిన 'వీరభద్ర'తో ఆమె తెలుగు తెరపై సందడి చేశారు. నటిగా రాణిస్తోన్న సమయంలోనే నటుడు నానా పటేకర్‌ తనని వేధించారంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మీటూ ఉద్యమం సమయంలోనూ సోషల్‌మీడియా వేదికగా ఆయనపై తనుశ్రీ విరుచుకుపడ్డారు.

tanushree-dutta comments
తనుశ్రీ దత్తా

ఇవీ చదవండి: ఎట్టకేలకు దిగొచ్చిన శ్రావణ భార్గవి.. ఆ వీడియో డిలీట్​

Jabardast: ఎమోషనల్​గా అనసూయ లాస్ట్ ఎపిసోడ్​.. ఎంత ఫీల్ అయిందో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.