ETV Bharat / entertainment

Rajinikanth Jailer Trailer : పవర్​ఫుల్​గా 'జైలర్' ట్రైలర్​.. రజనీ అదే స్టైల్, అదే స్వాగ్.. ఎక్కడా తగ్గలే - రజనీకాంత్ జైలర్ మూవీ రిలీజ్ డేట్​

Rajinikanth Jailer movie trailer : సూపర్ స్టార్ రజనీకాంత్‌ 'జైలర్' ట్రైలర్ వచ్చేసింది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది.

Jailer trailer
Rajinikanth Jailer Trailer
author img

By

Published : Aug 2, 2023, 6:53 PM IST

Updated : Aug 2, 2023, 7:43 PM IST

Rajinikanth Jailer movie trailer : సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన సినిమా 'జైలర్‌'. హీరోయిన్​ తమన్నా రజనీ సరసన నటించింది. మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్‌, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్‌, బాలీవుడ్ స్టార్ యాక్టర్​ జాకీ ష్రాఫ్‌, సీనియర్ నటి రమ్యకృష్ణ, టాలీవుడ్ విలక్షణ నటుడు సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 10న గ్రాండ్​గా అభిమానుల ముందుకు కానుంది. ఈ సందర్భంగా మూవీటీమ్​ 'షోకేస్‌' పేరిట ఓ ట్రైలర్‌ను గ్రాండ్​గా రిలీజ్​ చేసింది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం యాక్షన్‌ సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను పెంచుతోంది. మీరూ ఓ లుక్కేయండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ ప్రచార చిత్రంలో ఎప్పటిలాగే రజనీకాంత్ తన మార్క్​ స్టైల్, స్వాగ్​, ఎనర్జీతో అదిరిపోయేలా కనిపించారు. ఆయన డైలాగ్స్​ కూడా అదిరిపోయాయి. "ఈ వ్యాధి వచ్చిన వారు పిల్లిలా ఉంటారు. కానీ ఒక్కసారి దడేల్‍గా పులిలా మారుతారు"అంటూ బ్యాక్​గ్రౌండ్​లో రజినీని ఉద్దేశిస్తూ వచ్చిన డైలాగ్ బాగుంది. తన పోలీస్ కొడుకు, స్కూలు మనవడు షూ పాలీష్ చేస్తూ మొదట కనిపించిన రజనీ.. ఆ తర్వాత దడేల్​ పులిలా మారుతారంటూ యాక్షన్ మోడ్‍లోకి వెళ్లిపోయారు. "ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు.. కోతలే" అంటూ రజినీకాంత్ చెప్పిన డైలాగ్ హైలైట్​గా నిలిచింది. ఆ తర్వాత సూపర్ స్టైలిష్​గా యాక్షన్ సీన్లలో కనిపించి దడ పుట్టించారు. వింటేజ్ రజినీ కనిపించారు. ఈ సన్నివేశాలన్నింటికీ సెన్సేషన్ మ్యూజిక్​ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఫైనల్​గా 'టైగర్‌గా హుకుం' అంటూ రజినీ డైలాగ్‍తో షోకేస్ ట్రైలర్​ను ముగించారు మేకర్స్​. ఇక టాలీవుడ్​ కమెడియన్ కమ్​ విలన్​ సునీల్​ను కూడా ఓ షాట్​లో చూపించారు. ఇందులో సునీల్​.. ఇన్​కమ్​ ట్యాక్స్​ ఆఫీసర్స్​ వచ్చే ఏమైనా డొనేషన్స్​ కావాలా అంటూ కాస్త డిఫరెంట్​గా కనిపించారు. ​

Jailer cast and crew : ఈ సినిమాలో హీరోయిన్​గా తమన్నా నటిస్తోంది. రీసెంట్​గా ఆమె చిందులేసిన 'వా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి' అంటూ వచ్చిన సాంగ్​ సోషల్​మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. ఈ పాటకు అనిరుధ్‌ స్వరాలు అందించగా, సింధూజ శ్రీనివాసన్‌ దీనిని ఆలపించారు. సన్​ పిక్చర్స్​ సినిమాను నిర్మిస్తోంది.

ఇదీ చూడండి :

August tollywood movie releases 2023 : ఆగస్ట్ సినీ జాతర.. ఒకేసారి 25 సినిమాలు.. వారానికో మెగా హీరో సందడి

Actress Tamannaah Bhatia : 'జైలర్' ఆడియో లాంచ్​లో స్పెషల్​ అట్రాక్షన్​గా తమన్నా.. రెడ్​ డ్రెస్​లో కెమెరాకు హాట్ పోజులు

Last Updated : Aug 2, 2023, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.