ETV Bharat / entertainment

పవన్ కల్యాణ్​ 'OG'.. 70 ఏళ్లు వెనక్కి! - Pawankalyan OG movie 1950 story

Sujeeth Pawankalyan OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్​ న్యూస్​ బయటకు వచ్చింది. ఆ వివరాలు..

Pawan kalyan OG movie
పవన్ కల్యాణ్​ 'OG'.. 70 ఏళ్లు వెనక్కి!
author img

By

Published : Jun 12, 2023, 6:56 AM IST

Sujeeth Pawankalyan OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉంటున్నారు. అయితే ఆయన నటిస్తున్న సినిమాల్లో అభిమానులను బాగా ఆకర్షిస్తున్నది 'OG'. దాదాపు ఐదేళ్ల తర్వాత పవన్​ నటిస్తున్న ఫుల్​ ఫ్లెడ్జ్​ స్ట్రైట్​ ఫిల్మ్​ ఇది. 'సాహో' ఫేమ్​ దర్శకుడు సుజిత్.. ఈ చిత్రాన్ని గ్యాంగ్​స్టార్​ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి ఓ విషయం ఫ్యాన్స్​లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అదేంటంటే స్టైలిష్ డైరెక్టర్‌గా ఇమేజ్ క్రియేట్​ చేసుకున్న సుజిత్.. పవన్​ను ఈ చిత్రంలో సూపర్ స్టైలిష్‌గా చూపిస్తారని, అలానే సినిమాలో ఎలివేషన్లు భారీ రేంజ్​లో ఉంటాయని సినీ ప్రేక్షకులు, అభిమానులు అంచనాలు వేస్తున్నారు.

Pawankalyan OG movie Story : తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పవన్​ సాల్ట్​ అండ్​ పెప్పర్​ లుక్​లో కనిపిస్తారని తెలిసింది. ఇప్పటికే పవన్ లుక్స్​కు సంబంధించి రెండు మూడు సుజిత్​ డిజైన్​ చేశారట. మరో కొత్త విషయం ఏమిటంటే.. ఈ సినిమా 20,30 ఏళ్ల ముందు నడిచే కథ కాదట. ఏకంగా 70ఏళ్లు వెనక్కి తీసుకెళ్లబోతున్నారట! 1950 బ్యాక్​డ్రాప్​లో నడిచే కథగా దీన్ని తీర్చిదిద్దుతున్నారట. అప్పటి పరిస్థితులను రీక్రియేట్​ చేస్తున్నారట. ఒకవేళ ఇదే కనుక నిజమైతే... సుజిత్​.. పవన్​ను వింటేజ్​ గ్యాంగ్​స్టర్​లా ఎలా చూపిస్తారో?

pawan kalyan og movie cast : ఇక ఈ సినిమా విషయానికొస్తే.. పవన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ఇదే చివరగా మొదలైంది. కానీ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దీని కోసం ఆయన ఎక్కువ డేట్స్​ కూడా ఇచ్చారట. ఇక ఈ చిత్రంలో పవన్​.. మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా, గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నారని ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే రిలీజైన ఫొటోలు, పోస్టర్​లను చూస్తే ఇది అర్థమవుతోంది. రీసెంట్​గా సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం తమిళ నటుడు అర్జున్ దాస్‌ను ఎంపిక చేశారు. 'ఖైదీ', 'మాస్టర్​' సహా కొన్ని అనువాద చిత్రాలతో ఆయనకు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. తెలుగులో 'బుట్టబొమ్మ' సినిమా చేశారాయన. ఇంకా పవన్​ సరసన ప్రియాంక మోహన్​ హీరోయిన్​గా నటిస్తోంది. ప్రకాశ్​ రాజ్​ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ప్రభాత్‍తో 'సాహో' సినిమా చేసి.. సౌత్​తో పాటు నార్త్​లో యాక్షన్ అండ్​ స్టైలిష్​గా డైరెక్టర్‌గా సుజిత్​ గుర్తింపు తెచ్చుకోవడం, 'ఆర్​ఆర్​ఆర్'​తో బిగ్గెస్ట్ హిట్​ అందుకున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం వల్ల 'OG'పై భారీ అంచనాలు ఉన్నాయి.

Pawankalyan upcoming movies : ఇక పవన్​ కల్యాణ్​ 'ఓజీ' చిత్రంతో పాటు సముద్రఖని దర్శకత్వంలో 'బ్రో', హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్​ భగత్ సింగ్​', క్రిష్ డైరెక్షన్​లో 'హరిహర వీరమల్లు' చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవన్నీ కూడా షూటింగ్ దశలోని ఉన్నాయి. త్వరలోనే రిలీజ్​ కానున్నాయి.

ఇదీ చూడండి :

OG Movie : పవన్​ కల్యాణ్​ మైండ్​ బ్లాక్ రెమ్యునరేషన్​.. ఎంతంటే?

Pawan Kalyan Shoes Cost : పవన్ కల్యాణ్ 'బ్రో' షూస్​ అంతా కాస్ట్లీనా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.