ETV Bharat / entertainment

ప్రొఫెషనల్​ సింగర్​లా ఇంద్రజ​.. స్టేజ్ దద్దరిల్లేలా రష్మీ, సౌమ్య డ్యాన్స్​ - శ్రీదేవి డ్రామా కంపెనీ రష్మీ మాస్​ డ్టాన్స్​

శ్రీదేవి డ్రామా కంపెనీ తాజా ఎపిసోడ్​లో యాంకర్స్ రష్మి, సౌమ్య డ్యాన్స్ వల్ల స్టేజి దద్దరిల్లితే.. జడ్జి ఇంద్రజ పాట ప్రేక్షకుల హృదయాలను తాకింది. ఆ సంగతులు..

Sri devi drama company latest promo
ప్రొఫెషనల్​ సింగర్​లా ఇంద్రజ సాంగ్​.. స్టేజ్ దద్దరిల్లేలా రష్మీ, సౌమ్యా డ్యాన్స్​
author img

By

Published : Dec 16, 2022, 12:20 PM IST

బుల్లితెరపై విశేష ప్రజాదరణ పొందిన షోలలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్​లతో ప్రేక్షకులను అలరిస్తుంటుంది. ఇప్పుడీ కార్యక్రమం తాజాగా 100వ ఎపిసొడ్​ను సెలబ్రేట్ చేసుకోనుంది. ఈ సందర్భంగా కొత్తగా వచ్చిన యాంకర్ సౌమ్యా రావుతో పాటు రష్మీ చేసిన మాస్ డ్యాన్స్.. షో మొత్తానికే హైలెట్​గా నిలిచింది. రష్మీ తనదైన స్టైల్లో మాస్ డ్యాన్స్​తో రెచ్చిపోగా.. సౌమ్యా రావు క్లాసీ లుక్​తో అదరగొట్టేసింది. లంగాఓణీలో 'పుష్ప' సినిమాలోని చూపే బంగారమాయనే శ్రీవల్లీ పాటకు తనదైన హావభావాలతో క్లాస్​గా డ్యాన్స్​ వేసి ఆకట్టుకుంది సౌమ్య. ఆ తర్వాత రష్మీ.. రారా రెడ్డి సాంగ్​కు మాస్ డ్యాన్స్ తో స్టేజీని దద్దరిల్లేలా చేసింది. తన మార్క్ మాస్ స్టెప్​లతో ఓ ఊపు ఊపింది. నడుము స్టెప్పులతో చెమటలు పట్టించింది.

ఇంద్రజ సూపర్​ సాంగ్​.. అయితే ఈ ఎపిసోడ్​లో జడ్జి ఇంద్రజ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోసారి తన తియ్యటి గాత్రంతో అభిమానులను అలరించింది ఇంద్రజ. గత ఎపిసోడ్​లో తన మాస్ డ్యాన్స్​లతో ప్రేక్షకులను అలరించిన ఇంద్రజ.. ఈ సారి అద్భుతంగా పాడి ఆశ్చర్యపరిచింది. "ఏదో ఒకరాగం పిలిచింది ఈ వేళ" పాటను పాడుతుంటే అక్కడున్న ప్రతీ ఒక్కరు మైమరచిపోయారు. అంతలా తన గొంతుతో మెస్మరైజ్ చేసిందామె. 'ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ' అనే మరోపాట కూడా పాడింది. ఇది కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో అక్కడున్న వారందరూ ఆమెపై ప్రశంసలు కురిపించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: అత్తమ్మను మిస్‌ అవుతున్నా: ఉపాసన ఎమోషనల్​ పోస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.