ETV Bharat / entertainment

RC 15 ప్రాజెక్ట్‌పై శంకర్ క్లారిటీ, రెండూ ఒకేసారి జరుగుతాయంటూ - శంకర్​ రామ్​చరణ్​ సినిమా

కొన్ని కారణాల వల్ల నిలిచిపోయిన ఇండియన్​ 2 సినిమా షూటింగ్​ను తాజా మళ్లీ ప్రారంభించారు డైరెక్టర్ శంకర్. అయితే టాలీవుడ్​ హీరో రామ్​చరణ్‌తో తెరకెక్కిస్తున్న RC 15 ప్రాజెక్ట్‌ను శంకర్​ పక్కన పెట్టేశారని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో వాటిపై శంకర్ క్లారిటీ ఇచ్చారు.

RC 15 Shankar Clarity
RC 15 Shankar Clarity
author img

By

Published : Aug 25, 2022, 10:16 AM IST

Updated : Aug 25, 2022, 10:25 AM IST

RC 15 Shankar Clarity: డెరెక్టర్​ శంకర్-మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్ ప్రాజెక్టు మీద గత కొద్దిరోజులుగా వస్తున్న రూమర్లు అన్నీఇన్నీ కావు. ఆర్ట్ డైరెక్టర్ విషయంలో సమస్యలు రావడంతోనే సినిమా ఆగిపోయిందని, అందుకే శంకర్ కోపంతో ఇండియన్ 2 ప్రారంభించారని వార్తలు వచ్చాయి. అయితే వాటిపై శంకర్ క్లారిటీ ఇచ్చి రూమర్లకు చెక్ పెట్టారు.

RC 15 Shankar Clarity
డెరెక్టర్​ శంకర్​ ట్వీట్​

"హాయ్.. ఎవ్రీవన్.. ఇండియన్ 2, ఆర్సీ 15 రెండు కూడా ఒకేసారి షూటింగ్ జరుగుతాయి.. సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో హైదరాబాద్, వైజాగ్‌లో షూటింగ్‌కు రెడీగా ఉండండి.."అంటూ శంకర్​ ట్వీట్ చేశారు.
మొత్తానికి RC 15 ప్రాజెక్ట్​ త్వరలోనే సెట్స్ మీదకు రాబోతోంది. ఈ ప్రాజెక్టు మీద వచ్చిన ఊహాగానాలతో మెగా అభిమానులు కాస్త ఆందోళన చెందినా ఇప్పుడు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఆర్​సీ 15ను దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 60 శాతం వరకు చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. డిసెంబర్‌ నాటికి మొత్తం పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ మూడు భిన్నమైన గెటప్పుల్లో కనిపించనున్నారు. సంగీతం- తమన్‌, మాటలు- సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం- తిరు, ఆర్‌.రత్నవేలు అందిస్తున్నారు.

ఇవీ చదవండి: మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్న అవతార్​, ఆ ఎఫెక్ట్స్​తో సరికొత్తగా

ఈ నటుడెవరో గుర్తుపట్టుకోండి చూద్దాం

Last Updated : Aug 25, 2022, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.