ETV Bharat / entertainment

షారుక్​ 'పఠాన్' రెమ్యునరేషన్​.. కేజీయఫ్​,​ బాహుబలి బడ్జెట్ కన్నా ఎక్కువగా! - బాలీవుడ్​ బాద్​షా శారుఖ్​

'పఠాన్' సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరో షారుక్​ ఖాన్ తీసుకున్న రెమ్యునరేషన్​ ప్రస్తుతం సోషల్​మీడియాలో హాట్​టాపిక్​గా మారింది. కేజీయఫ్ 2, బాహుబలి చిత్రాల బడ్జెట్ కన్నా ఎక్కువ పారితోషికం తీసుకున్నారట. ఎంతంటే?

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 18, 2023, 3:45 PM IST

Updated : Apr 18, 2023, 5:24 PM IST

బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​ నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పఠాన్ సినిమాతో రీసెంట్​గా స్క్రీన్​ పై మెరిసి బ్లాక్​బాస్టర్​ హిట్​ను అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ ముందు రూ. 1,000 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే మాములుగానే షారుక్​ రెమ్యునరేషన్ రూ.100 కోట్లు ఉంటుందని టాక్​. దీంతో పాటే లాభాల్లోనూ వాటాను తీసుకుంటారట. అయితే పఠాన్​ సినిమాకు.. నిర్మాతలు రూ.100కోట్లు కన్నా భారీ మొత్తాన్ని షారుక్​కు ఇచ్చారని తెలిసింది.

ఇంతకీ ఎంతంటే?.. 'పఠాన్​' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1050 కోట్లు వసూలు చేసింది! ఇందులో భారత్ నుంచే రూ.545 కోట్లు వచ్చాయి. అయితే ఈ సినిమా బడ్జెట్ రూ. 270 కోట్లు అని అంచనా. అయితే ఈ మూవీకి వచ్చిన లాభాల్లో షారుక్​ దాదాపు ​60 శాతం వాటా అడిగారట. ఫైనల్​గా దాదాపు రూ.200కోట్ల వరకు తీసుకున్నారని తెలిసింది. ఈ పారితోషికం.. రీసెంట్​గా బ్లాక్​బాస్టర్​గా నిలిచిన భారీ చిత్రాల బడ్జెట్​ కన్నా ఎక్కువ. అలా షారుక్.. కేజీయఫ్​ చాప్టర్​ 2 (రూ. 100 కోట్లు), పద్మావత్ (రూ. 180 కోట్లు), బాహుబలి (రూ. 180 కోట్లు) బడ్జెట్ కన్నా ఎక్కువ మొత్తాన్ని రెమ్యునరేషన్​గా తీసుకున్నారని సమాచారం..

ప్రస్తతం అట్లీ దర్శకత్వంలో షారుక్​ జవాన్​ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ కోసం చిత్ర బృందం దాదాపు 25 పేర్లను పరిశీలించారట.. జవాన్​ కోసం నయనతార షారుక్​తో జత కట్టనుంది . విజయ్​ సేతుపతి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. కాగా జవాన్​లో షారుక్ డ్యుయల్ రోల్​లో అభిమానులను అలరించనున్నారు. చిత్ర యూనిట్​ ఈ ఏడాది జూన్​లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు..

ఇకపోతే పఠాన్ సినిమా విషయానికొస్తే.. షారుక్​కు జంటగా బాలీవుడ్​ బ్యూటీ దీపికా పదుకొణే నటించారు. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా.. సూపర్​ హిట్​గా నిలిచి బాలీవుడ్​కు పూర్వవైభవాన్ని తీసుకొచ్చింది. సిద్దార్థ్​ ఆనంద్​ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్ అబ్రహం విలన్​ రోల్​ పోషించారు. డింపుల్​ కపాడియా, రాణా అశుతోష్ ముఖ్య పాత్రల్లో నటించారు. యశ్​రాజ్​ ఫిలింస్​ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించారు.

Last Updated : Apr 18, 2023, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.