ETV Bharat / entertainment

చాలా కాలం తర్వాత కెమెరా ముందుకు లయ.. హోం టూర్​ వీడియో షేర్​! - సీనియర్ నటి లయ ఇన్​స్టా ఫొటోస్​

తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి లయ. అప్పట్లో ఎన్నో హిట్​ సినిమాల్లో హీరోయిన్​గా నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మళ్లీ చాలా కాలం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. హోం టూర్​ వీడియో చేశారు. పలు సంగతులను కూడా చెప్పుకొచ్చారు. ఆ వివరాలు..

Senior Actress Laya Home tour video
లా కాలం తర్వాత కెమెరా ముందుకు లయ.. హోం టూర్​ వీడియో చూశారా?
author img

By

Published : Feb 25, 2023, 8:48 PM IST

సోషల్ మీడియా - సెలబ్రిటీలు ఈ రెండిటి కనెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సామాజిక మాధ్యమం ద్వారా సెలబ్రిటీల తమకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ అభిమానులతో టచ్​లో ఉంటారు. తెరపై కనుమరుగైపోయిన యాక్టర్స్​ కూడా ఈ సోషల్​మీడియా ద్వారా ఫ్యాన్స్​కు, ఆడియెన్స్​కు దగ్గరగా ఉంటారు. అలా సిల్వర్​ స్క్రీన్​కు దూరమైన నటుల్లో ఒకరైన నటి లయ కూడా గత కొద్ది కాలంగా సామాజిక మాధ్యమాల్లో ఫుల్ యాక్టివ్​గా ఉంటూ ఫొటోషూట్స్​, రీల్స్​, డ్యాన్స్​లతో ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా చాలా కాలం తర్వాత ఓ యూట్యూబ్​ ఛానల్​కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అలా హోమ్ టూర్ వీడియో చేశారు. తన పర్సనల్ లైఫ్​తో పాటు సినీ కెరీర్​కు సంబంధించిన విషయాలను కూడా తెలిపారు.

తనకు వచ్చిన అవార్డుల గురించి కూడా చెప్పి సంతోషడ్డారు. మూడు నంది అవార్డులు వచ్చినట్లు గుర్తుచేసిన లయ.. పురస్కారాలన్నింటినీ అమెరికాకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. తన ఇంట్లో పెంచుకునే పక్షుల గురించి చెప్పుకొచ్చారు. అన్ని భాషల్లో కలిపి దాదాపు 60కు పైగా సినిమాల్లో నటించినట్లు చెప్పిన ఆమె.. అందులో 40కుపైగా తెలుగే అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ అరవింద సమేతలో నటించే అవకాశం వచ్చినా తాను చేయలేదని తెలిపారు. అప్పట్లో చీరలు మాత్రమే కట్టుకుని షూటింగ్​ చేసే తాము.. అప్పుడప్పుడు ప్యాంట్స్​, షర్ట్స్​ వేసుకుని కూడా షూటింగ్ చేస్తామంటే నిర్మాతలు ఒప్పుకునే వారు కాదని వెల్లడించారు.

కాగా, 'స్వయంవరం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న నటి లయ. కేవలం ఫ్యామిలీ టైప్​ రోల్స్​లోనే నటించి అభిమానుల హృదయాల్ని దోచుకున్నారు. ఆ తర్వాత మా బాలాజీ, మనోహరం, మనసున్న మారాజు, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, మిస్సమ్మ వంటి సినిమాల్లో హీరోయిన్​గా అలరించి తనకంటూ ఓ ఇమేజ్​ను క్రియేట్​ చేసుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నటించి ఆడియెన్స్​ను మెప్పించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. యూఎస్​లో సెటిల్ అయిపోయారు. కానీ ఆ మధ్యలో 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో మెరిశారు.

ఇదీ చూడండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్​ కె'లో కీలక మార్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.