Sarkaru vaari pata Pre release event: సుపర్‌స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. మే 12న చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మే 2న ట్రైలర్ విడుదల చేసిన చిత్ర బృందం.. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. సాయంత్రం 6 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పింది. అయితే చీఫ్ గెస్ట్‌గా ఎవరు రాబోతున్నారో ఇంకా వివరాలు తెలియలేదు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ట్రైలర్లో మహేశ్ క్లాస్ అండ్ మాస్ లుక్స్, ఆయన చెప్పిన డైలాగ్స్ అభిమానులను హుషారెత్తించేలా ఉన్నాయి. ఈ ట్రైలర్లో చూపించిన సన్నివేశాల్ని బట్టి యాక్షన్, కామెడీ, లవ్.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో సినిమా రూపొందినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను పరశురామ్ తెరకెక్కించగా.. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించింది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు.
-
It's time for celebrations🤘
— Mythri Movie Makers (@MythriOfficial) May 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
All the Super⭐ fans assemble at the police grounds on May 7th for the Grand #SVPPreReleaseEvent 💥#SarkaruVaariPaata#SVPOnMay12
Super🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @madhie1 @14ReelsPlus @GMBents @saregamatelugu pic.twitter.com/XAvKL0jkUJ
">It's time for celebrations🤘
— Mythri Movie Makers (@MythriOfficial) May 5, 2022
All the Super⭐ fans assemble at the police grounds on May 7th for the Grand #SVPPreReleaseEvent 💥#SarkaruVaariPaata#SVPOnMay12
Super🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @madhie1 @14ReelsPlus @GMBents @saregamatelugu pic.twitter.com/XAvKL0jkUJIt's time for celebrations🤘
— Mythri Movie Makers (@MythriOfficial) May 5, 2022
All the Super⭐ fans assemble at the police grounds on May 7th for the Grand #SVPPreReleaseEvent 💥#SarkaruVaariPaata#SVPOnMay12
Super🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @madhie1 @14ReelsPlus @GMBents @saregamatelugu pic.twitter.com/XAvKL0jkUJ
Shekar movie trailer: యాంగ్రీ యంగ్‌మ్యాన్ రాజశేఖర్ కథానాయకుడిగా ఆయన సతీమణి జీవిత తెరకెక్కిస్తున్న చిత్రం 'శేఖర్'. బొగ్గరం వెంకట శ్రీనివాస్, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ సంయుక్తంగా నిర్మించారు. మే 20న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించి ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది మూవీటీమ్. యాక్సిడెంట్‌గా చిత్రీకరించిన ఓ మర్డర్ కేసును ఛేదించే రిటైర్డ్ ఆఫీసర్‌గా రాజశేఖర్ కనిపించారు. వయసు పైబడిన వ్యక్తిగా రాజశేఖర్ కొత్త లుక్స్ బాగున్నాయి. "పోలీస్ యూనిఫామ్ వేసుకొని కూడా డ్యూటీ చేయని వాళ్లు చాలామంది ఉంటారు. అదే, పోలీస్ ఉద్యోగానికి రిజైన్ చేసి కూడా డ్యూటీ కోసం ప్రాణాలిచ్చే వాళ్లు వేలల్లో ఒక్కరే ఉంటారు" అంటూ సమీర్ చెప్పే డైలాగ్‌లతో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగుతూ.. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ప్రకాశ్‌రాజ్, రాజశేఖర్ కూతురు శివాని శివాత్మిక ముఖ్య పాత్రలు పోషించారు. మలయాళంలో విజయవంతమైన 'జోసెఫ్'కు రీమేక్‌గా రూపొందిందీ చిత్రం. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. ఎన్.మల్లిఖార్జున్ ఛాయాగ్రహణం అందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: గోవాలో శ్రియ.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోందిగా!