ETV Bharat / entertainment

ఒక్క దెబ్బతో అన్నయ్య లైఫ్​ సెట్​ చేసిన సందీప్- అప్పుడు 32ఎకరాలు అమ్మేసినా! - ప్రొడ్యూసర్​ ప్రణయ్​ రెడ్డి వంగా సినిమాలు

Sandeep Reddy Vanga Birthday Special : సందీప్​రెడ్డి వంగా, ప్రణయ్​ రెడ్డి వంగా బాక్సాఫీస్​ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నారు. వరుస విజయాలతో రూ.కోట్లు సంపాదిస్తున్నారు! అసలు వీరి జర్నీ ఎలా మొదలైందంటే?

Sandeep Reddy Vanga Birtdhay Special
Sandeep Reddy Vanga Birtdhay Special
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 8:00 AM IST

Sandeep Reddy Vanga Birthday Special : ప్రణయ్ రెడ్డి వంగా, సందీప్​ రెడ్డి వంగా ఈ పేర్లు ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఒకరేమో ఫేమస్​ డైరెక్టర్​. మరొకరేమో సోదరుడి కోసం నిర్మాతగా మారిన వ్యక్తి. ఇద్దరి లక్ష్యం ప్రేక్షుకులకు సినిమాలను అందించడమే. అయితే సినీ ఇండస్ట్రీలో ఇద్దరూ రాణిస్తున్నప్పటికీ సందీప్​ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. వీరిద్దరూ ఎప్పటి నుంచో కలసి పని చేస్తున్నా, 'యానిమల్​' సినిమాతో వీరి పేర్లు నెట్టింట మార్మోగాయి.

తాజాగా యానిమల్​ మూవీ ప్రమోషన్స్​లో సందీప్​ రెడ్డి తన సోదరుడు ప్రణయ్ రెడ్డి గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో ఆయన తనకెంత సహాయపడ్డారో వివరించారు. ఓ స్టోరీని నిర్మాత సరిగ్గా అర్థం చేసుకుని అందుకు తగినంత స్వాత్రంత్యాన్ని డైరెక్టర్​కు ఇస్తే తప్ప ఆ సినిమా సక్సెస్​ఫుల్​గా తెరకెక్కదని సందీప్ మాట.

'అర్జున్ రెడ్డి' విషయంలో సందీప్​కు నిర్మాతల నుంచి అనేక సమస్యలు వచ్చాయట. దీంతో ఈ సినిమా కోసం సరైన నిర్మాతను వెతికి అలసిపోయి తన అన్నయ్య ప్రణయ్ రెడ్డి బ్యానర్​పై ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. తమ్ముడిపై ఉన్న నమ్మకంతో అమెరికాలో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి నిర్మాతగా మారారు ప్రణయ్​. ఈ సోదరులిద్దరూ తొలి ప్రాజెక్టుతోనే సక్సెస్ సాధించారు.

సందీప్​ను పూర్తిగా​ అర్ధం చేసుకుని కావాల్సిన స్పేచ్ఛ ఇస్తారట అన్నయ్య ప్రణయ్​. అందుకే తాను చక్కగా సినిమాలను తెరకెక్కిస్తానంటూ పలు సందర్భాల్లో సందీప్ గర్వంగా చెప్పుకున్నారు. ఆ స్వేచ్ఛ కారణంగా అప్పుడు అర్జున్ రెడ్డి విషయంలో ఇప్పుడు యానిమల్ విషయంలోనూ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తనకు నచ్చినట్లు సినిమాను తెరకెక్కించారట. అయితే కబీర్ సింగ్ తప్ప మిగిలిన రెండు సినిమాలు కూడా తన అన్నయ్య ప్రణయ్ నిర్మాణంలోనే తీశారు సందీప్​. ఈ రెండు చిత్రాలు కూడా మంచి టాక్ అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి.

మరోవైపు యానిమల్ సినిమాతో ప్రణయ్ రెడ్డి జాక్ పాట్ కొట్టేశారంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. టీ సీరీస్​తో కలిసి ఈ సినిమాను ప్రణయ్​ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. దీని బడ్జెట్ సుమారు రూ.200 కోట్లు కాగా ఇప్పటికీ సుమారు రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమా లాభాల్లో ప్రణయ్​ షేర్ రూ.120 నుంచి రూ.150 కోట్లు ఉండొచ్చని సమాచారం.

ఒకప్పుడు సినిమా కోసం ఫ్యామిలీకి చెందిన 32 ఎకరాలు అమ్మేసిన ఈ సోదరులు ఇప్పుడు సినిమాలు తీస్తూ భారీ ఎత్తున లాభాలను అర్జిస్తున్నారు. ఇకపై ఆయన తెరకెక్కించనున్న సినిమాలను తన అన్న నిర్మాణంలోనే రూపొందిస్తానంటూ సందీప్ చెబుతున్నారు. ఒకవేళ వేరే బ్యానర్ లో సినిమా చేయాల్సి వచ్చినా కూడా దాంట్లో కూడా ప్రణయ్ భాగస్వామ్యం ఉండేలా చూసుకుంటానంటూ చెబుతున్నారట సందీప్.

మెగాస్టార్​ చిరంజీవితో యాక్షన్​ సినిమా చేస్తా : 'యానిమల్​' డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా

'అది నేను ఊహించలేదు - రణ్​బీర్​తో నా రిలేషన్​షిప్​ అలాంటిది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.