ETV Bharat / entertainment

యంగ్​ హీరోతో సమంత కొత్త సినిమా.. క్రేజీ కాంబో! - స‌మంత‌ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ కొత్త సినిమా

సినీ ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబో తెరపైకి రానుంది! హీరోయిన్ సమంత ఓ యంగ్ హీరోతో కలిసి సినిమా చేయనుందట. ఆ వివరాలు..

Samantha Siddhu Jonnalagadda
యంగ్​ హీరోతో సమంత కొత్త సినిమా.. క్రేజీ కాంబో!
author img

By

Published : May 17, 2023, 1:57 PM IST

సినీ ఇండస్ట్రీలో హిట్ పెయిర్స్ తెరపై కనిపిస్తుంటే ఆడియెన్స్​ ఎంతలా ఇష్టపడతారో.. అలాగే క్రేజీ పెయిర్స్​ను కూడా అంతే ఆసక్తిగా చూసేందుకు ఇష్టపడతారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్.. యంగ్ హీరోల కాంబినేషన్స్​ ఎప్పుడు ఇంట్రెస్టింగ్​గానే ఉంటుంది. ఇప్పటికే తెలుగు చిత్రసీమలో అనుష్క శెట్టి.. నవీన్ పొలిశెట్టి కాంబోలే ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో క్రేజీ కాంబో తెరపై సందడి చేయడానికి రెడీ అవ్వనుందని సమాచారం అందుతోంది.

అసలు విషయానికొస్తే.. హీరోయిన్‌ స‌మంత‌-డైరెక్ట‌ర్ నందినిరెడ్డి మ‌ధ్య చ‌క్క‌టి స్నేహబంధం ఉన్న సంగతి తెలిసిందే. క‌ష్ట‌స‌మ‌యాల్లో త‌న‌కు అండ‌గా నిలిచిన స‌న్నిహితుల్లో నందినిరెడ్డి ఒక‌రని స‌మంత ప‌లు సంద‌ర్భాల్లో కూడా చెప్పుకొచ్చింది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో 'జ‌బ‌ర్దస్త్'​తో పాటు 'ఓ బేబీ' సినిమాలొచ్చాయి. అయితే ఈ రెండింటిలో బాక్సాఫీస్ వద్ద 'జబర్దస్త్'​ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే 'ఓ బేబీ' మాత్రం కమర్షియల్​గా హిట్​ను అందుకుంది. సామ్​ నటనకు మంచి మార్కులు కూడా వచ్చాయి. విమర్శల నుంచి ప్రశంసలు దక్కాయి.

అయితే ఇప్పుడు మళ్లీ స‌మంత‌-నందినిరెడ్డి కాంబినేష‌న్‌లో మరో చిత్రం రాబోయే అవకాశాలున్నాయని సమాచారం అందింది. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో 'డీజే టిల్లు' ఫేమ్​ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. నందిని రెడ్డి గత సినిమాల తరహాలోనే.. ఈ చిత్రం కూడా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కనున్నట్లు అని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుందట. ప్రస్తుతం స్క్రిప్ట్​ పనులు జరుగుతున్నాయట. ఇకపోతే నందినిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'అన్నీ మంచిశ‌కున‌ములే' చిత్రం ఈ శుక్ర‌వారం ఆడియెన్స్​ ముందుకు రానుంది. ఈ సినిమాలో సంతోష్‌శోభ‌న్‌, మాళ‌వికానాయ‌ర్ హీరోహీరోయిన్లుగా నటించారు.

మ‌రోవైపు రీసెంట్​గా గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంత‌లం' సినిమాతో ఆడియెన్స్​ను అలరించింది సమంత. కానీ ఇది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్​గా నిలిచింది. ప్ర‌స్తుతం తెలుగులో సెన్సేషనల్ స్టార్​ విజయ్​ దేవరకొండ 'ఖుషి' సినిమా చేస్తోంది. ఇది లవ్​ అండ్​ రొమాంటిక్​ ఎంటర్​టైనర్​గా రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబరులో రిలీజ్ కానుంది. ఇక ఖుషి సినిమాతో పాటు 'సిటాడెల్' హిందీ వెబ్‌సిరీస్‌లోనూ యాక్షన్ రోల్​లో నటిస్తోంది స‌మంత‌. దీనికి రాజ్​ అండ్ డీకే దర్శకత్వం వహించగా.. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే 'డీజే టిల్లు' హిట్​ను అందుకున్న హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ.. 'డీజే టిల్లు స్కేర్​'లో న‌టిస్తున్నారు. ఇందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా కనిపించనుంది. అలాగే సిద్ధు.. మెగాస్టార్ చిరంజీవి నటించబోయే కొత్త సినిమాలోనూ నటించే ఛాన్స్​ అందుకున్నారని తెలిసింది.

ఇదీ చూడండి : sharwanand marriage : శర్వానంద్​ పెళ్లి డేట్‌ ఫిక్స్‌.. వేదిక ఎక్కడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.