ETV Bharat / entertainment

సల్మాన్​ 'టైగర్‌ - 3' రిలీజ్‌ అప్పుడే - salman khan new movie

కత్రినా కైఫ్​తో కలిసి నటించిన తన కొత్త సినిమా రిలీజ్​ డేట్​ను ప్రకటించారు హీరో సల్మాన్ ఖాన్​. విడుదల ఎప్పుడంటే

salman khan tiger 3 release date
సల్మాన్​ 'టైగర్‌ - 3' రిలీజ్‌ అప్పుడే
author img

By

Published : Oct 15, 2022, 2:24 PM IST

'ఏక్‌ థా టైగర్‌', 'టైగర్‌ జిందా హై' చిత్రాల్లో సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంట ప్రేక్షకులను సమ్మోహనపరిచింది. ఆ చిత్రాల్లో టైగర్‌గా సల్మాన్‌ సాహసాలు, జోయాగా కత్రినా గ్లామర్‌ వహ్వా అనిపించాయి. ఇప్పుడు ఆ సిరీస్‌లో తదుపరి చిత్రంగా 'టైగర్‌ 3' వస్తోంది. మనీశ్‌ శర్మ దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సల్మాన్‌ ప్రకటిస్తూ.. కొత్త పోస్టర్‌ షేర్‌ చేశారు. హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ ఈ సినిమా విడుదల కానున్నట్లు వెల్లడించారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో రానున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, సల్మాన్‌ ప్రస్తుతం.. 'కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌'లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి: ర్యాంప్​ వాక్​తో హీటెక్కించిన అందాల తారలు చూస్తే కళ్లు తిప్పుకోరంతే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.