ETV Bharat / entertainment

ట్యాక్సీ డ్రైవర్‌కు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టా.. కానీ: సల్మాన్​ - సల్మాన్​ ఖాన్​ ట్యాక్సీ డ్రైవర్​

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన జీవితంలో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను తెలియజేశారు. తన కాలేజీ రోజుల్లో ఓ ట్యాక్సీ డ్రైవర్‌కు డబ్బు ఎగ్గొట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కానీ ఆ తర్వాత అతడికి వడ్డీతో సహా ఇచ్చేశానని తెలిపారు.

salman khan
salman khan
author img

By

Published : Apr 15, 2023, 10:00 PM IST

సాధారణంగా సినిమాల్లో అవకాశాలు అంత సులభంగా రావని అందరికీ తెలిసిన విషయమే. హార్డ్ వర్క్‌తో పాటు అదృష్టం కూడా బాగా కలిసి వస్తేనే వెండితెర కల నెరవేరుతుంది! ఇప్పుడున్న స్టార్ హీరోల్లో చాలా మంది ఇలాంటి కష్టాలు అనుభవించి వచ్చినవాళ్లే. కొన్నిసార్లు చిత్రసీమలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లు సైతం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అయితే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ హిందీ చిత్రసీమలో గుర్తింపున్న రచయిత అయినప్పటికీ.. ఆయన కాలేజ్‌ చదివే రోజుల్లో క్యాబ్ ఛార్జీలు చెల్లించడానికి కూడా డబ్బులు ఉండేవి కాదట. ఈ విషయాన్ని సల్మాన్ ఖానే స్వయంగా తెలియజేశారు.

బాలీవుడ్‌‍లో సలీమ్-జావేద్ రచయితల ద్వయం ఎంతో ఫేమస్. వీరిద్దరి కథను అందించిన చాలా సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. అయితే జావేద్ నుంచి సలీమ్ విడిపోయిన తర్వాత సోలో రైటర్‌గా అవకాశాల కోసం ఆయన ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయన సంపాదన తక్కువ ఉండటంతో సల్మాన్ కుటుంబం కొంతకాలం ఇబ్బంది పడిందట. ముఖ్యంగా సల్మాన్ కాలేజీలో చదివే రోజుల్లో క్యాబ్ ఫీజు చెల్లించడానికి కూడా డబ్బులు ఉండేవి కాదట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సల్మాన్​ ఖాన్​.. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

"మేము సాధారణంగా కాలేజీకి ట్రైన్‌లో వెళ్లేవాళ్లం. కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితిలో క్యాబ్‌ను తీసుకునేవాళ్లం. ఒకరోజు అలాగే ట్యాక్సీలో వెళ్లాలని అనుకున్నా. కానీ నా వద్ద డబ్బులు లేవు. నేను డ్రైవర్‌ను మా కాలేజ్ దగ్గర ఆపి.. లోపలకు వెళ్లి డబ్బు తీసుకొస్తానని చెప్పి.. తిరిగి వెళ్లలేదు" అంటూ సల్మాన్​ చెప్పుకొచ్చారు. అయితే మోడలింగ్‌లో అడుగుపెట్టిన తర్వాత తాను డబ్బులు ఎగ్గొట్టిన క్యాబ్ డ్రైవర్‌కు వడ్డీతో సహా ఇచ్చానని సల్మాన్ తెలిపారు.

"కొన్ని రోజులకు మోడలింగ్‌లో అడుగుపెట్టిన నేను నిదానంగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాను. అలాగే ఒకసారి ట్యాక్సీలో ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఆ ట్యాక్సీ డ్రైవర్ నన్నెక్కడో చూశానని ప్రయాణం చేసినంత సేపు చెబుతూనే ఉన్నారు. మా ఇంటి వద్దకు చేరిన తర్వాత నేను పైకి వెళ్లి డబ్బు తీసుకొస్తాను.. అంతవరకు ఇక్కడే ఉండమని చెప్పాను. అప్పుడు వెంటనే అతడు నన్ను గుర్తుపట్టాడు. ఇద్దరం గతంలో జరిగిన సంఘటన తలచుకుని పగలబడి నవ్వుకున్నాం. కానీ ఆ తర్వాత నేను అతడికి వడ్డీతో కలిపి ట్యాక్సీ డబ్బును చెల్లించాను" అని సల్మాన్ తన జీవితంలో జరిగిన ఫన్నీ సంఘటనను గుర్తు చేసుకున్నారు.

2009 నుంచి రంజాన్ కానుకగా సల్మాన్ ఖాన్ తన సినిమాలను విడుదల చేయడం సెంటిమెంటుగా పెట్టుకున్నారు. వాంటెడ్ నుంచి త్వరలో విడుదల కానున్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రం వరకు చాలా సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ ఏప్రిల్ 21న ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. టాలీవుడ్ యాక్టర్లు వెంకటేశ్​, భూమికా చావ్లా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.