ETV Bharat / entertainment

టాలీవుడ్​పై సల్మాన్​ ఫోకస్​.. స్టార్​ దర్శకుడితో భేటీ! - సల్మాన్​ ఖాన్​ మైత్రీ మూవీ మేకర్స్​్

Salmankhan Harishshankar: బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్​.. టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్​, దర్శకుడు హరీశ్ శంకర్​ను కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి. ఈ భేటీ ప్రస్తుతం సినీప్రియుల్లో ఆసక్తి నెలకొంది.

Salman khan Harishankar meets
Salman khan Harishankar meets
author img

By

Published : Apr 13, 2022, 11:03 AM IST

Updated : Apr 13, 2022, 11:41 AM IST

Salmankhan Harishshankar: బాలీవుడ్​ స్టార్ హీరో సల్మాన్​ ఖాన్​.. ప్రస్తుతం తెలుగు మీడియాలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. మెగాస్టార్​ చిరంజీవిలో కలిసి 'గాడ్​ఫాదర్'​లో నటిస్తుండటం, 'బాలీవుడ్​ చిత్రాలు తెలుగులో ఎందుకు ఆడట్లేదు?' అని ఇటీవలే ఓ ఈవెంట్​లో ప్రశ్నించడం వంటి విషయాలతో ఆయన హాట్​టాపిక్​గా మారారు. అయితే ఇప్పుడాయన మరోసారి వార్తల్లో నిలిచారు. టాలీవుడ్​పై సల్మాన్​ ఫోకస్​ పెట్టినట్లు అంతా మాట్లాడుకుంటున్నారు. భాయ్​.. తాజాగా టాలీవుడ్​ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్​తో భేటి అయినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో దర్శకుడు హరీశ్​ శంకర్​ కూడా ఉండటం మరో విశేషం. ఈ విషయాన్ని దర్శకుడు హరీశ్​ తెలుపుతూ.. భాయ్​తో కలిసి దిగిన ఫొటోలను సోషల్​మీడియా వేదికగా ట్వీట్​ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి. దీంతో ఈ భేటీకి ప్రాముఖ్యత సంతరించుకుంది. సినీప్రియుల్లో భారీగా ఆసక్తిగా నెలకొంది.

"సల్మాన్​ఖాన్​కు ధన్యవాదాలు. ఆయన్ను కలవడం, కలిసి సమయాన్ని గడపడం ఎంతో సంతోషంగా ఉంది. నా జీవితంలో ఇది ఓ మధురమైన అనుభూతి. మీ విలువైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు. ముఖ్యంగా భాయ్​ను కలిసే అవకాశాన్ని కల్పించినందుకు మైత్రీ నిర్మాత యెర్నేని గారికి ప్రత్యేక ధన్యవాదాలు." అని హరీశ్ శంకర్​ పేర్కొన్నారు. ఇది చూసిన అభిమానులు.. వీరు ఎందుకు భేటీ అయ్యారు అన్న విషయంపై ఆరాతీయడం ప్రారంభించారు. మైత్రీ మూవీ మేకర్స్​ సంస్థతో సల్మాన్​ సినిమా చేయబోతున్నాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వీరు ఎందుకు కలిశారో తెలియాలంటే అధికారికంగా ప్రకటించే వరకు వేచి ఉండాల్సిందే. కాగా, సల్మాన్​ ఖాన్​.. ప్రస్తుతం చిరు 'గాడ్​పాధర్'​, షారుక్ 'పఠాన్'​లో అతిథి పాత్రలో కనిపించనుండగా.. టైగర్​ 3 సినిమాలో నటిస్తున్నారు. ఇక హరీశ్ శంకర్.. పవన్​కల్యాణ్​ 'భవదీయుడు భగతసింగ్​' ప్రీ ప్రొడక్షన్​ పనుల్లో బిజీగా ఉన్నారు.

Salman khan Harishankar meets
సల్మాన్​ ఖాన్​ హరీశ్​ శంకర్​ భేటీ
Salman khan Harishankar meets
సల్మాన్ ఖాన్​​ హరీశ్ శంకర్​ భేటీ
Salman khan Harishankar meets
మైత్రీ మూవీ మేకర్స్​ నిర్మాతతో సల్మాన్​ ఖాన్​ భేటీ

ఇదీ చూడండి: Vijay Beast review: విజయ్​ 'బీస్ట్​'.. ఎలా ఉందంటే?

Last Updated : Apr 13, 2022, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.