saindhav movie updates : హీరో విక్టరీ వెంకటేశ్.. చాలా కాలం తర్వాత యాక్షన్ మూవీతో అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆయన కెరీర్లో మైలురాయిగా నిలవబోయే 75వ సినిమాగా ఇది రూపొందుతోంది. 'హిట్' సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలనుతో కలిసి 'సైంధవ్' పేరుతో చేస్తున్నారు. టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌తోనే ఈ మూవీ స్పెషల్ ఇంట్రెస్ట్‌ను కలిగించింది.
అప్పట్లోనే ఈ టైటిల్ గ్లింప్స్‌ను చూసి.. ఈ మూవీ స్టోరీ అంతా ఓ పాప, ఇంజెక్షన్ చుట్టూ తిరుగుతుందని ప్రచారం సాగింది. ఇప్పుడదే నిజమని అర్థమవుతోంది. తాజాగా (జులై 17) చిత్రబృందం ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో సార అనే పాప.. వెంకీని హత్తుకుని కనిపించింది. ఈ పోస్టర్లో వెంకటేశ్, పాప ముఖంపై బాగా దెబ్బలు కనిపిస్తున్నాయి. అలానే పాప పాత్ర పేరు గాయత్రి అని కూడా తెలిపారు మేకర్స్. 'రివీలింగ్ ది హార్ట్ ఆఫ్ సైంధవ్' అని తెలిపారు.
అంటే ఈ సినిమా కథ మొత్తం పాప చూట్టే తిరుగుతుందని అని కన్ఫామ్ అయిపోయింది. సైంధవ్‌గా వెంకీ కనిపించనున్నారు. అంటే ఆ పాప ఆయన చేసే పోరాటమే ఈ కథ అని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రంలోని ప్రతి పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుందని మూవీ మేకర్స్ చెబుతున్నారు.
రూ.16కోట్లు ఇంజెక్షన్.. గతంలో ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ విడుదల చేసినప్పుడు.. వెంకటేశ్ చేతిలో గన్, ఇంజెక్షన్ బాక్స్ పట్టుకుని కనిపిస్తారు. ఆ ఇంజెక్షన్ బాక్స్ మీద Genezo(ఓ సంస్థ పేరు), ఇంజెక్షన్ మీద onasemnogene abeparvovec అనే పేర్లు రాసి ఉంటాయి. ఇవి SMA (Spine Muscular Atrophy) అనే అరుదైన వ్యాథికి చికిత్స అందించేందుకు ఉపయోగిస్తారు. దీనికి మరో పేరు Zolgensma. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రగ్స్‌లో ఇదీ ఒకటి. దీని ధర.. దాదాపు రూ.16కోట్లు ఉంటుంది. కొంతకాలం క్రితం చాలా మంది పసిపిల్లలు SMA వ్యాధితో పారాడారు. కొంతమంది మరణించారు. అప్పుడు ఈ ఇంజక్షన్ ద్వారా కొంతమంది కాపాడారు. మరి కొంతమందికి ఈ ఇంజెక్షన్ పనిచేయలేదు. అంటే ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఉన్న పాప కాపాడుకునేందుకు.. వెంకీ పోరాటం చేస్తాడని అర్థమవుతోంది.
ఇకపోతే ఈ చిత్రంలో వెంకటేశ్‌ను ఢీ కొనే పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ నటిస్తున్నారు. ఈ చిత్రంతో ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వికాస్ మాలిక్ అనే ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లో ఆయన ఖరీదైన కారుపై స్లైలిష్‌గా కూర్చొని ఆకట్టుకున్నారు. శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోశ్ నారాయన్ మ్యూజిక్ డైరెక్టర్. టైటిల్ గ్లింప్స్‌కు ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 22న చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇదీ చూడండి :
వెంకీ 'సైంధవ్' కథ రూ.16కోట్ల ఇంజెక్షన్ చుట్టేనా.. పాప కోసమే పోరాటమా?
వెంకీ 'సైంధవ్' నుంచి నవాజుద్దీన్ ఫస్ట్ లుక్ రిలీజ్.. లగ్జరీ కారుపై కూర్చుని బీడీ తాగుతూ!