ETV Bharat / entertainment

జక్కన్నకు గోల్డెన్​ ఛాన్స్​... 'అవతార్​' దర్శకుడితో కలిసి పనిచేసేలా.. - రాజమౌళికి జేమ్స్ కామెరూన్​

దర్శకధీరుడు రాజమౌళికి హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చూసి ఫిదా అయిన ఆయన భవిష్యత్తులో ఎప్పుడైనా జక్కన్నకు హాలీవుడ్‌లో సినిమా చేసే ఉద్దేశం ఉంటే తనని సంప్రదించాలని కోరారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ నెటిజన్లతో పంచుకుంది. మీరూ ఆ వీడియోను చూసేయండి.

rrr-team-shares-full-video-of-rajamouli-and-james-cameron-chat

author img

By

Published : Jan 21, 2023, 2:56 PM IST

హాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌, భారతీయ దర్శకధీరుడు రాజమౌళి ఇటీవల ఓ కార్యక్రమంలో కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియజేస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ తాజాగా ఓ వీడియో షేర్‌ చేసింది. దీనిపై పలువురు స్పందిస్తూ.. భారతీయ సినిమాకు దక్కిన గొప్ప గౌరవం అంటూ కొనియాడుతున్నారు.

ఇటీవల అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో జేమ్స్‌ కామెరూన్‌ను రాజమౌళి కలిశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి వీరిద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందంటూ ఇందులోని పలు సీన్లను కామెరూన్‌.. జక్కన్నకు తెలియజేశారు. ఈ చిత్రాన్ని కామెరూన్‌ రెండుసార్లు చూసినట్లు ఆయన సతీమణి సుజీ కామెరూన్‌ వెల్లడించారు. వీరిద్దరి మాటలతో రాజమౌళి అమితానందం పొందారు. ఈ మొత్తం సంభాషణకు సంబంధించిన ఓ స్పెషల్‌ వీడియోను ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ శనివారం విడుదల చేసింది.

రాజమౌళి: టెర్మినేటర్‌, అవతార్‌, టైటానిక్‌.. ఇలా మీరు తెరకెక్కించిన అన్ని చిత్రాలను నేను చూశాను. అవి నాలో స్ఫూర్తి నింపాయి. మీ వర్క్ అంటే నాకెంతో ఇష్టం.
కామెరూన్‌: మీరు తెరకెక్కించిన చిత్రాలు, అందులోని పాత్రలు చూస్తుంటే విభిన్నమైన అనుభూతి కలిగింది. నిప్పు, నీరు, కథ.. ఇలా ఒకదాని తర్వాత మరొకటి మీరు చూపించిన విధానం, బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీని చెప్పిన తీరు నాకెంతో నచ్చింది. స్నేహం, వైరాన్ని చూపించిన సన్నివేశాలు.. వావ్‌ అనేలా ఉన్నాయి.

రాజమౌళి: మీ నుంచి వచ్చిన ఈ మాటలు నాకు అవార్డుల కంటే ఎంతో ఎక్కువ. నేను తెరకెక్కించిన చిత్రాన్ని మీరు చూసి, దాన్ని ఇలా విశ్లేషించడాన్ని ఓ మై గాడ్‌.. నమ్మలేకపోతున్నా.
సుజీ కామెరూన్‌: ఆర్‌ఆర్‌ఆర్‌ను ఆయన రెండుసార్లు చూశారు. మొదటిసారి ఆయన ఒక్కరే చూశారు. తర్వాత మేమిద్దరం కలిసి చూశాం. సినిమా చూస్తున్నంతసేపు.. ప్రతి సీన్‌ను ఆయనే ముందు చెప్పేశారు.

కామెరూన్‌: షూట్‌కు ఎంతకాలం పట్టింది.
రాజమౌళి: 320 రోజులు.

కామెరూన్‌: మీరే కదా ఈచిత్రానికి సంగీతం అందించింది. మిమ్మల్ని నేను గోల్డెన్‌ గ్లోబ్స్‌లో చూశాను.
కీరవాణి: థ్యాంక్యూ సర్‌.
కామెరూన్‌: సంగీతం ఎంతో బాగుంది. కొన్ని సన్నివేశాలకు నేను లేచి నిల్చొన్నాను. మీరు మరెంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా.

అంతే కాకుండా..రాజమౌళికి జేమ్స్‌ కామెరూన్‌ అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చూసి ఫిదా అయిన ఆయన భవిష్యత్తులో ఎప్పుడైనా జక్కన్నకు హాలీవుడ్‌లో సినిమా చేసే ఉద్దేశం ఉంటే తనని సంప్రదించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.