ETV Bharat / entertainment

డబ్బులు చెల్లించనక్కర్లేదు.. ఓటీటీలో ఫ్రీగానే ఆర్​ఆర్ఆర్ - undefined

'ఆర్ఆర్ఆర్' సినిమా ఈ నెల 20 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్​ కానుంది. ఈ నేపథ్యంలో ఓటీటీ సంస్థ జీ5 కీలక ప్రకటన చేసింది. 'పే ఫర్ వ్యూ' పద్ధతి లేకుండా.. జీ5 సబ్​స్క్రైబర్లు ఉచితంగానే సినిమా చూడవచ్చని ప్రకటించింది.

RRR
ఆర్​ఆర్ఆర్​
author img

By

Published : May 19, 2022, 12:40 PM IST

Updated : May 19, 2022, 1:10 PM IST

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఓటీటీలో రిలీజ్​ కానున్న నేపథ్యంలో కీలక అప్డేట్​ వచ్చింది. ఈ సినిమా జీ5లో ఈనెల 20 నుంచి స్ట్రీమింగ్​ కానుంది. తొలుత పే ఫర్ వ్యూ పద్ధతిలో సినిమాను విడుదల చేయాలని భావించారు. అయితే.. ప్రేక్షకులతో పాటు.. జీ5 సబ్​స్క్రైబర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడం వల్ల జీ5లో వెనక్కి తగ్గింది. 'పే ఫర్ వ్యూ' పద్ధతి లేకుండా.. జీ5 సబ్​స్క్రైబర్లు ఉచితంగానే సినిమా చూడవచ్చని ప్రకటించింది. అయితే సబ్​స్క్రిప్షన్​ లేనివాళ్లు కచ్చితంగా ప్రీమియం చెల్లించి చూడాల్సి ఉంటుందని వెల్లడించింది.

  • A good day indeed, as #ZEE5 Premium Subscribers can watch the World Digital Premiere for FREE from May 20th
    Re-experience the roar, only on 4K Ultra HD!
    Note: The best update from the roaring film!

    World Digital Premiere - ONLY on #ZEE5#RRRonZee5fromMay20 Download Zee5 app now pic.twitter.com/wAYh4LMQ0h

    — ZEE5 Telugu (@ZEE5Telugu) May 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తొలుత అదనపు ప్రీమియం రూ. 100 చెల్లించి సినిమాను చూడాల్సి ఉంటుందని జీ5 చెప్పింది. ఈ క్రమంలో ప్రజల నుంచి.. ప్రధానంగా సబ్​స్క్రైబర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సినిమాకు విడుదలకు ముందు ఆయా ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకుని టికెట్ల రెట్లు పెంచుకొని.. ఇప్పుడు ఓటీటీలో కూడా డబ్బులు చెల్లించమనడం ఎంతవరకు సమంజసమని ప్రేక్షకులు మండిపడ్డారు. ఈ క్రమంలో జీ5కి అనేక వినతులు వచ్చినట్లు సమాచారం. దీంతో నిర్వాహకులపై తీవ్రమైన ఒత్తి రావడం వల్ల తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

ఇదీ చదవండి: వాహ్​ తమన్నా: ఈ గ్లామర్​ బండి.. స్వర్గం నుంచి వచ్చినట్టుంది!

Last Updated : May 19, 2022, 1:10 PM IST

For All Latest Updates

TAGGED:

rrr
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.