ETV Bharat / entertainment

గోల్డెన్​ గ్లోబ్స్​లో బెస్ట్ సాంగ్​గా 'నాటు నాటు'.. ఆ పాట గురించి ఈ విషయాలు తెలుసా?

'ఆర్​ఆర్​ఆర్'​లోని నాటు నాటు సాంగ్​.. గోల్డెన్​ గ్లోబ్​​ అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్​ సాంగ్​ క్యాటగిరీలో నామినేట్​ అయిన ఈ సాంగ్ అవార్డును సైతం సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్​ ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఈ పాట గురించి ఆసక్తికర విషయాలను నెమరువేసుకుందాం..

naatu naatu
naatu naatu
author img

By

Published : Jan 11, 2023, 7:51 AM IST

Updated : Jan 11, 2023, 9:20 AM IST

సిల్వర్ స్క్రీన్‌పై 'నాటు'(మాస్​) పాటలకు ఉండే క్రేజే వేరబ్బా. భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల వాళ్లను తెగ ఉర్రూతలూగిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఇలాంటి పాటలకు చాలా సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్​తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఫుల్​ ఎంజాయ్ చేస్తారు. అలాంటి కోవలోకే చెందినదే 'ఆర్​ఆర్​ఆర్​ నాటు నాటు' సాంగ్​ కూడా. 2021లో విడుదలైన ఈ సాంగ్​ సంచలనం సృష్టించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు... పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు... కిర్రు సెప్పులేసుకూని కర్రసాము సేసినట్టు... మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు... ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు... నా పాట సూడూ.. నా పాట సూడూ" అంటూ ఈ సాంగ్​తో వీర నాటు, ఊర నాటు స్టెప్పు లేస్తూ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియుల్ని తెగ ఊర్రూతలూగించారు యంగ్ టైగర్​ ఎన్టీఆర్​, మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​. విదేశీయలు చేత కూడా ఈ పాటకు స్టెప్పులేయించేలా చేశారు.

అసలు ఈ పాట విడుదలైన కొన్ని క్షణాల్లోనే నెట్టింట వందల సంఖ్యలో స్పూఫ్‌లు, రీమిక్స్‌లు దర్శనమిచ్చాయి. ముఖ్యంగా యువత కవర్‌ సాంగ్స్‌తో, ఎడిటర్స్‌.. తమ అభిమాన కథానాయకుల పాత సాంగ్స్‌తో ఈ 'నాటు'ను రీక్రియేట్‌ చేస్తూ సోషల్‌మీడియాలో ట్రెండ్‌ సృష్టించారు. అయితే ఇప్పుడా సాంగ్ మళ్లీ ఫుల్​ ట్రెండ్​లోకి వచ్చింది. ఎందుకంటే తాజాగా ఈ పాట.. బెస్ట్​ సాంగ్​ క్యాటగిరీలో గోల్డన్​ గ్లోబ్​ అవార్డ్​ను సొంతం చేసుకుంది. ఆస్కార్​ నామినేషన్స్​ రేసులోకి సైతం దూసుకొచ్చింది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరి షార్ట్‌ లిస్టులో చోటు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈ సాంగ్ విశేషాలు సహా.. దీని గురించి వివిధ సందర్భాల్లో రాజమౌళి, రామ్​చరణ్​, ఎన్టీఆర్​ ఏం మాట్లాడారో ఓ సారి నెమరు వేసుకుందాం..

100 సిగ్నేచర్​ స్టెప్పులు.. గతంలో ఓ కార్యక్రమం కోసం దర్శకుడు రాజమౌళి అమెరికాకి వెళ్లినప్పుడు అక్కడ ఈ పాట గురించి ప్రస్తావించారు. "నా స్నేహితులు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు ఇద్దరూ అద్భుతమైన డ్యాన్సర్లు. ఇక వాళ్లిద్దరూ కలిసి ఒకే పాటకు డ్యాన్స్ చేస్తున్నారంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఆ పాట కోసం నేను ఒక సీన్‌ను క్రియేట్‌ చేసి స్టోరీలో భాగంగా ఆ పాట వచ్చేలా చూశా. ఇక 'నాటు నాటు' సాంగ్‌కు కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌. అతనికి డ్యాన్స్ అంటే ప్రాణం. 3 నిమిషాలకు పైన ఉన్న 'నాటు నాటు' సాంగ్‌ కోసం అతడు 100 సిగ్నేచర్‌ స్టెపులు వేయించారు. ఆ పాటకు డ్యాన్స్‌ వేసేటప్పటికి డ్యాన్సర్స్‌ అందరికీ కాళ్ల నొప్పులు వచ్చాయి" అని చెప్పారు. రాజమౌళి ఆ పాట గురించి చెప్పగానే ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగిపోయింది.

ఆ స్టెప్​ కోసం 15-18 టేక్స్‌!.. ఈ నాటు కోసం చరణ్‌, ఎన్టీఆర్‌ వేసిన స్టెప్పులు చూపుతిప్పుకోనివ్వకుండా ఉన్నాయి కదా. అయితే ఇంత క్రేజ్‌ సంపాదించుకున్న ఈ పాట స్టెప్స్‌ కోసం వారిద్దరు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఆ కష్టం గురించి తారక్​ మాట్లాడుతూ.. "నాటు నాటు పాటలోని హుక్‌ స్టెప్‌.. కాళ్లు ఎడమ, కుడి, ముందు, వెనుక తిప్పి స్టెప్‌ పర్ఫెక్ట్‌గా సింక్‌ అయ్యేందుకు నేను చెర్రీ, 15-18 టేక్స్‌ తీసుకున్నాం. ఈ విషయంలో రాజమౌళి ఇద్దరికీ నరకం చూపించారు (నవ్వుతూ). ముఖ్యంగా ఇద్దరిదీ ఒకే తీరులో వస్తుందా అని తెలుసుకునేందుకు మధ్యమధ్యలో డ్యాన్స్‌ స్టెప్స్‌ ఆపేసేవారు. అలా.. నాదీ, చెర్రీది చేతుల, కాళ్ల కదలికలు సింక్‌ అవుతున్నాయా లేదా అని చూసుకునేవారు. ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్‌లో ఈ పాటను చిత్రీకరించాం. ఇక ఈ లిరికల్‌ వీడియోలోని డ్యాన్స్‌ స్టెప్స్‌కు వచ్చిన విశేష స్పందన చూశాక.. రాజమౌళి విజన్‌ మాకు అర్థమైంది. అందరూ ఆ హుక్‌ డ్యాన్స్‌ స్టెప్స్‌ సింక్‌ బాగుందంటూ కామెంట్‌ చేస్తున్నారు. అప్పుడే జక్కన్నను పిలిచి అడిగా ఇది మీకు ఎలా సాధ్యమైందని.. జక్కన ఓ టాస్క్‌ మాస్టర్‌. అందుకే భారతదేశం గర్వించదగ్గ ప్రముఖ దర్శకుడు అయ్యారు" అని అన్నారు.

యూట్యూబ్​ సైతం ఫిదా.. 0.5X చూసినా.. సగటు ప్రేక్షకుడి నుంచి సెలబ్రిటీల వరకూ అంతా చరణ్‌, తారక్‌ డ్యాన్స్‌ వేగానికి ఫిదా అయిపోయారు. యూట్యూబ్‌ ఇండియా (Youtube India) సైతం ఈ ఇద్దరి హీరోల డ్యాన్స్‌ వేగం గురించి తన అభిప్రాయం తెలియజేసింది. 'నిజం చెప్పాలంటే.. చరణ్‌, ఎన్టీఆర్‌ డ్యాన్స్‌ను 0.5x స్పీడ్‌తో చూసినా ఫాస్ట్‌గానే కనిపిస్తుంది' అని ట్వీట్‌ చేసింది. అయితే దీనిపై 'ఆర్‌ఆర్‌ఆర్‌' కూడా స్పందించింది. 'మేం 2x స్పీడ్‌తో ఎడిట్ చేద్దామనుకున్నాం. కానీ.. మా డ్యాన్సింగ్‌ డైనమైట్స్‌ (తారక్‌, చరణ్‌) ఇద్దరూ ఆ అవసరం లేకుండా అదే లైటెనింగ్‌ స్పీడ్‌తో డ్యాన్స్‌ చేసి అందరనీ ఆశ్చర్యపరిచారు' అని బదులిచ్చింది.

రికార్డుల మోత.. ఈ హుషారైన సంగీతం యుట్యూబ్​లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. విడుదలైన 24 గంటల్లో 10.4 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి.. సౌత్ ఇండియాలో ఈ రికార్డ్ క్రియేట్ చేసిన ఫస్ట్ సినిమాగా నిలిచింది. 48 గంటల్లోనే 20 మిలియన్ల (2 కోట్లు) వీక్షణలు (అన్ని భాషల్లో కలిపి) సొంతం చేసుకుని యూట్యూబ్‌లో మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత ఇలా ఎన్నో రికార్డులను అందుకుంది.

81 పోటీపడగా.. ఆ 15లో చోటు.. ఇక నాటు నాటు సాంగ్ ఆస్కార్ రేసు విషయానికొస్తే.. ఈ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో షార్ట్ లిస్ట్ అయింది. మొత్తంగా 81 పాటలు ఈ కేటగిరీలో పోటీ పడటానికి అర్హత సాధించగా... అందులో 15 పాటలను సెలెక్ట్ చేశారు. ఆ పదిహేనులో ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్​ ఒకటి. అయితే వీటిలో మళ్ళీ ఐదు పాటలు నామినేషన్స్‌కు వెళతాయి. ఆ తర్వాత ఐదింటిలో ఒకటి విజేతగా నిలుస్తుంది.

పాట వివరాలు..

  • నాటు నాటు రచయిత: చంద్రబోస్​
  • స్వరాలు: కీరవాణి
  • సింగర్స్​: రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ
  • కొరియోగ్రఫీ: ప్రేమ్‌ రక్షిత్‌

ఇదీ చూడండి: Pathan: మరోసారి షారుక్​-దీపిక కలర్​ ఫుల్ హాట్​​ షో.. సెకండ్​ సాంగ్​ అదిరింది!

Last Updated : Jan 11, 2023, 9:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.