ETV Bharat / entertainment

'ఏంటమ్మా' సాంగ్‌.. ముగ్గురం అదరగొట్టేశాం.. ఫుల్‌ ఎంజాయ్‌ చేశాం: చెర్రీ

సల్మాన్‌ఖాన్‌, వెంకటేశ్‌ కలిసి నటించిన చిత్రం 'కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌'. ఈ సినిమాలోని ఏంటమ్మా పాటకు సల్మాన్​, వెంకీలతో డ్యాన్స్​ చేశారు హీరో రామ్‌చరణ్‌. అయితే ఆ సాంగ్‌ చేసేట‌ప్పుడు తెగ ఎంజాయ్ చేశాన‌ని.. అంద‌రం క‌లిసి అద‌ర గొట్టేశామని చెర్రీ తెలిపారు.

ram-charan-about-yentamma-song-kisi-ka-bhai-kisi-ka-jhan-movie

author img

By

Published : Apr 6, 2023, 10:18 PM IST

బాలీవుడ్‌ భాయ్‌జాన్‌ సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌'. ఇటీవలే ఈ సినిమా నుంచి ఏంట‌మ్మా అనే పాట‌ రిలీజైంది. ఇందులో స‌ల్మాన్ ఖాన్‌, టాలీవుడ్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేశ్‌లతో కలిసి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి చేసిన డ్యాన్స్‌కు సూపర్​ రెస్పాన్స్​ వచ్చింది. ఈ పాట రిలీజైన రెండు రోజుల్లోనే అన్ని సామాజిక మాధ్య‌మాల్లో క‌లిపి 43 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ సాధించి దూసుకెళ్తోంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర నిర్మాత‌లు ఈ సాంగ్‌కు సంబంధించిన మేకింగ్​ వీడియోను గురువారం రిలీజ్ చేశారు. ఇందులో రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. ఏంట‌మ్మా సాంగ్‌ను చేసేట‌ప్పుడు తెగ ఎంజాయ్ చేశాన‌ని, అంద‌రం క‌లిసి అద‌ర గొట్టేశామన్నారు. ఇద్ద‌రు పెద్ద స్టార్ హీరోల‌తో క‌లిసి తాను ఏంటమ్మా సాంగ్‌లో న‌టించటం క‌ల నిజ‌మైన‌ట్లుగా ఉంద‌ని, మ‌ర‌చిపోలేని అనుభూతి అని చెప్పారు. ఈ పాటను వెండితెరపై చూసినప్పుడు ఫ్యాన్స్‌కు పండ‌గ‌లా ఉంటుంద‌న్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అయితే ఈ పాటలో చెర్రీ ఎంట్రీ ఇవ్వడంతోనే ఇది మరోస్థాయికి వెళ్లిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ పాటలో చరణ్‌ ఎలా భాగమయ్యారో తెలుసా?.. 'కిసీ కా బాయ్‌ కిసీ కీ జాన్‌' షూట్‌ హైదరాబాద్‌లో గతేడాది జరిగింది. సల్మాన్‌ఖాన్‌- వెంకటేశ్‌పై కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు. ఆ సమయంలో ఓసారి సల్మాన్‌ను కలవడానికి చరణ్‌ ఈ సినిమా సెట్స్‌కు వెళ్లారు. తాను కూడా ఈ సినిమాలో భాగం కావాలనుకున్నట్లు సల్మాన్‌తో చెప్పారు. అప్పుడు దానికి సల్మాన్‌ అంగీకరించలేదు. 'సరే.. రేపు రా చూద్దాం' అన్నారట. సల్మాన్‌ మాటతో ఆనందించిన చరణ్‌.. మరుసటి రోజు ఉదయాన్నే మేకప్‌ వేసుకుని సెట్‌లోకి అడుగుపెట్టేశారట. అలా ఆయన ఈ పాటలో భాగమయ్యారట.

అదే సెట్‌..!
'ఏంటమ్మా..' పాటను చిత్రీకరించిన ప్లేస్‌ను చూస్తే ఆ సెట్‌ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. అది నిజమే.. ఈ సెట్‌ తెలుగువారికి గతంలోనే పరిచయం. చిరంజీవి- రామ్‌చరణ్‌ కలిసి నటించిన 'ఆచార్య' చిత్రంలో కనిపించే ధర్మస్థలి సెట్‌ అది. 'ఏంటమ్మా' పాటలో కనిపించే దేవాలయం.. ధర్మస్థలిలో కనిపించే అమ్మవారి ఆలయం ఒక్కటే. కాకపోతే కొన్ని మార్పులు చేశారు. ఫర్హాద్‌ సామ్జీ తెరకెక్కిస్తున్న 'కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌' ఈద్‌ సందర్భంగా ఏప్రిల్‌ 21న విడుదల కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.