ఇటీవల 'లైగర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు విజయ్ దేవరకొండ. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. దాదాపు రూ.60 కోట్లకు పైగా నష్టాలొచ్చినట్లు సమాచారం. ఈ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు విజయ్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెడుతున్నారు. లిస్ట్‌లో ఎన్ని ఫ్లాప్ సినిమాలున్నా.. విజయ్‌తో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు దర్శకనిర్మాతలు.
ఇప్పటికే అగ్ర నిర్మాత అశ్వనీదత్.. విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే సరైన కథ మాత్రం దొరకలేదు. ఇప్పుడు కథను లాక్ చేసినట్లు తెలుస్తోంది. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌తో దక్షిణాదిలో పాపులర్ అయిన రాజ్ అండ్ డీకే దర్శకులు విజయ్‌తో సినిమా చేయాలనుకుంటున్నారట. ఇటీవల వారు చెప్పిన కథ విజయ్‌కు నచ్చిందట. అదే కథ అశ్వనీదత్ దగ్గరకు తీసుకెళ్లగా.. దాదాపు ఫైనల్ అయినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారట.
దిల్‌రాజుతో విజయ్ సినిమా..
నిర్మాత దిల్‌రాజు కూడా విజయ్‌తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' తరువాత విజయ్‌కు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతల్లో దిల్‌రాజు కూడా ఒకరు. ఇప్పుడు దిల్‌రాజుతో కలిసి పని చేయడానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దాంతో పాటు ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అవే 'ఖుషీ', 'జనగణమన'. అయితే 'జనగణమన' క్యాన్సిల్ అయిందని టాక్.
ఇవీ చదవండి: విక్రమ్@100 రోజులు.. కమల్ వాయిస్ ట్వీట్ వైరల్!