Producer Gorantla Rajendra Prasad Died: ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు మరణాన్ని మర్చిపోకముందే తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం జరిగింది. సినీ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ (86) కన్నుమూశారు. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాజేంద్రప్రసాద్ మరణంతో టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గోరంట్ల రాజేంద్రప్రసాద్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రముఖ నిర్మాత రామానాయుడుతో కలిసి ఎన్నో చిత్రాలకు రాజేంద్రప్రసాద్ సహ నిర్మాతగా వ్యవహరించారు. 'మాధవి పిక్చర్స్' సంస్థను స్థాపించి అపురూప చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. 'దొరబాబు', 'సుపుత్రుడు', 'కురుక్షేత్రం', 'ఆటగాడు' వంటి చిత్రాలు ఆ బ్యానర్ నుంచి వచ్చినవే.
ఇదీ చదవండి: కూర్పు కళలో రా'రాజు'.. ఎడిటర్ గౌతంరాజు.. విషాదంలో అభిమానులు