ETV Bharat / entertainment

బండ్లగణేశ్ ఆడియో మెసేజ్​ వైరల్​.. అందులో ఏముందంటే? - బండ్ల గణేశ్ ఆడియో మెసేజ్​

Producer Bandla ganesh Audio message: ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్​.. తాజాగా ఓ ఆడియో సందేశాన్ని షేర్​ చేశారు. తల్లిదండ్రుల్ని, భార్యాపిల్లల్ని తప్ప జీవితంలో ఎవర్నీ నమ్మకూడదని చెప్పారు. ప్రస్తుతం ఈ ఆడియో మెసేజ్​ సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది.

producer Bandla ganesh
నిర్మాత బండ్ల గణేశ్​
author img

By

Published : Jun 18, 2022, 2:03 PM IST

Producer Bandla ganesh Audio message: తెలుగు చిత్రసీమలో నటుడు, నిర్మాతగా రాణిస్తున్న బండ్ల గణేశ్‌ ఏదో ఒకటి వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంటారు. తాజాగా శనివారం ఉదయం ఓ ఆడియో ఫైల్‌ను షేర్‌ చేశారు. తల్లిదండ్రుల్ని, భార్యాపిల్లల్ని తప్ప జీవితంలో ఎవర్నీ నమ్మకూడదన్నారు. "జీవితంలో ఎవర్నీ నమ్మొద్దు. మనల్ని మనం నమ్ముకుందాం. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని నమ్ముకుందాం. మనల్ని నమ్మి వచ్చిన జీవిత భాగస్వామిని, మన పిల్లల్ని ప్రేమిద్దాం. వాళ్లకి మంచి భవిష్యత్తుని, అందమైన జీవితాన్ని ఇద్దాం. ఎందుకంటే వాళ్లు మనపై కోటి ఆశలతో జీవిస్తున్నారు. కొన్నింటిపై ఇష్టాలు పెంచుకుని మన అనుకునే వాళ్లకి అన్యాయం చేయవద్దు" అని బండ్లగణేశ్‌ తెలిపారు.

ప్రస్తుతం ఈ ఆడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు.. "బండ్లన్న.. ఉన్నట్టుండి నువ్వు ఇలాంటి సందేశాలు ఎందుకు ఇస్తున్నావ్‌?", "ఏమైంది గణేశ్‌ అన్నా? జీవితంలో ఏదైనా ఎదురుదెబ్బ తగిలిందా?" అని వరుస కామెంట్లు చేస్తున్నారు. కాగా, బండ్లగణేశ్‌ ఇటీవల హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 'డేగల బాబ్జీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వేసవి కానుకగా విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనలు అందుకుంది.

ఇదీ చూడండి: 'కోడలు వస్తుందని మీ అమ్మకు చెప్పు'.. ఇమ్మూకు వర్ష ప్రపోజల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.