ETV Bharat / entertainment

ప్రభాస్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్.. 'రెబల్'​ రీరిలీజ్.. ఎప్పుడంటే? - prabhas newmovie

టాలీవుడ్​లో కొనసాగుతున్న రీరిలీజ్ ట్రెండ్​లోకి మరో హీరో వచ్చారు. డ్యాన్స్​ మాస్టర్ రాఘవ లారెన్స్​ దర్శకత్వంలో వచ్చిన 'రెబల్'​ సినిమాను ప్రభాస్​ పుట్టిన సందర్భంగా రీరిలీజ్ చేయనున్నారు.

prabhas rebel movie
prabhas rebel movie
author img

By

Published : Oct 8, 2022, 10:18 AM IST

తెలుగులో రీరిలీజ్​ ట్రెండ్ కొనసాగుతోంది. ఇది వరకే మహేశ్​​ బాబు 'పోకిరి', పవన్​ కల్యాణ్​ 'జల్సా', బాలకృష్ణ 'చెన్నకేశవ రెడ్డి' సినిమాల రీరిలీజ్​కు సైతం భారీగా అభిమానులు వచ్చారు. తాజాగా ఈ ఖాతాలోకి ప్రభాస్​ చేరారు. ప్ర‌భాస్ నటించిన 'రెబెల్' ప‌దేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కాబోతుంది.

లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో 2012లో 'రెబెల్' సినిమా వచ్చింది. మంచి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో ప్ర‌భాస్​ సరసన తమన్నా నటించారు. ఈ మూవీలో ఇటీవలే మరణించిన రెబల్​ స్టార్​ కృష్ణంరాజు కూడా ఓ కీలక పాత్ర చేశారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌ను మిగిల్చింది. 'రెబెల్‌' సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు సంగీతాన్ని లారెన్స్ అందించారు. ఈ సినిమా విష‌యంలో నిర్మాత‌ల‌కు లారెన్స్‌తో విభేదాలు వ‌చ్చాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అక్టోబరు 15న ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా రీ రిలీజ్ కానుంది.

ప్రభాస్​ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన 'ఆదిపురుష్'​ టీజర్ ఇటీవలే రిలీజ్​ అయింది. అలాగే ప్రశాంత్​ దర్శకత్వంలో సలార్, నాగ్​అశ్విన్​తో మరో ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు ప్రభాస్.

ఇవీ చదవండి: మాల్దీవుల్లో చేత్నా ఫుల్​ ఎంజాయ్​​.. రాధికా ఆప్టే గ్లామర్​ ట్రీట్​

​కొత్త వెబ్​సిరీస్ కోసం సామ్​ 'స్పెషల్​' ట్రైనింగ్​.. షూటింగ్​ అప్పుడే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.