ఇండియన్ సూపర్స్టార్లందరూ ఒకే చోట దర్శనమివ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి సంఘటన హైదరాబద్‌లో జరిగింది. అయితే అది ఏ సినిమా వేడుకో కాదు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ విశేషం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టార్ హీరోలు ప్రభాస్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాని, దుల్కర్ సల్మాన్ హాజరై సందడి చేశారు.
హీరోలతో పాటే దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వైజయంతీ బ్యానర్లోనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' చేస్తున్నారు. ఇందులో అమితాబ్, దీపికా పదుకొణె ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఇక ఇదే నిర్మాణ సంస్థలో దుల్కర్.. 'సీతారామం' అనే సినిమా చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకుడు.
ఇదీ చూడండి: పవన్, బన్నీ, తారక్.. ఎందుకు ఇన్ని డౌట్లు పెడుతున్నారు?