ETV Bharat / entertainment

ప్రభాస్​ షాకింగ్ నిర్ణయం.. అభిమానుల్లో నిరాశ! - ప్రభాస్​ పుట్టిన రోజుపై నిర్ణయం

పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆ పని చేయనని తేల్చిచెప్పారు. దీంతో అభిమానులు నిరాశ పడుతున్నారు. విషయం ఏంటంటే..

prabhas birthday decision
prabhas birthday decision
author img

By

Published : Oct 22, 2022, 3:55 PM IST

లవర్‌బాయ్‌గా, అమ్మాయిల కలల రాకుమారుడిగా, మాస్‌ హీరోగా, అమరేంద్ర బాహుబలిగా ఇలా పలు పాత్రలతో వైవిధ్యాన్ని కనబరిచాడు ప్రభాస్​. 'బాహుబలి', 'బాహుబలి-2' చిత్రాల తర్వాత ప్రభాస్‌ క్రేజ్‌ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రూ.వందకోట్లకే పరిమితమైన తెలుగు చిత్ర పరిశ్రమ మార్కెట్‌ను రూ.2 వేల కోట్లకు చేర్చి తెలుగోడి సత్తాని సగర్వంగా చాటిన యువ తరంగం ప్రభాస్‌. అయితే ఆయన తన అక్టోబర్​ 23న తన 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు. దీంతో సినీ వర్గాల​తో పాటు అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఆయన పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా చేసుకునేందుకు ఫ్యాన్స్​ సిద్ధమయ్యారు. అయితే మన డార్లింగ్ మాత్రం ఓ నిర్ణయం తీసుకున్నారట. దీంతో ఆయన అభిమానులు కాస్త నిరాశపడ్డారు. ఏంటంటే.. ఆయన ఈ సారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఈ విషయాన్ని సినీవర్గాలు తెలిపాయి.

ఇటీవలే ప్రభాస్​ పెద్దనాన్న, సినీ దిగ్గజం.. కృష్ణం రాజు మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ కారణంగానే ప్రభాస్ ఈ సంవత్సరం తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోరని సినీ వర్గాలు వెల్లడించాయి.

అయితే ప్రభాస్ బర్తడే సందర్భంగా ఆయన నటిస్తున్న మూవీటీమ్​ ఫ్యాన్స్​కు సర్​ప్రైజెస్​ ప్లాన్​ చేశాయి. ప్రస్తుతం డార్లింగ్​.. సలార్​, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్​ అప్డేట్స్​ను విడుదల చేయనున్నారు. కాగా, ప్రభాస్.. త్వరలోనే దర్శకుడు మారుతీతో చేయబోయే సినిమా కోసం రెడీ అవుతున్నారని తెలిసింది.

ఇవీ చదవండి : హిందీ బిగ్​బాస్​ యాంకర్​గా కరణ్​ జోహార్!​.. మరి సల్మాన్​​?

హిందీ బిగ్​బాస్​ యాంకర్​గా కరణ్​ జోహార్!​.. మరి సల్మాన్​​?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.