ETV Bharat / entertainment

ఆదిపురుష్​ కలెక్షన్లు డౌన్​!.. ఇంకా ఎన్ని రూ.కోట్లు వసూలు చేయాలో తెలుసా? - ఆదిపురుష్​ మూవీ వరల్డ్​ వైడ్​ కలెక్షన్స్

Adipurush Box Office Collection : మైథలాజికల్​ మూవీ ఆదిపురుష్​.. ఆరో రోజు కలెక్షన్లు​ తగ్గుముఖం పట్టాయి! అయితే ఈ సినిమా లాభాలు బాట పట్టాలంటే ఎన్ని కోట్లు రావాలో తెలుసా?

prabhas adipurush movie day 6 collections

author img

By

Published : Jun 22, 2023, 2:22 PM IST

Adipurush Box Office Collection : పాన్ ఇండియా హీరో ప్రభాస్, బాలీవుడ్ స్టార్​ కృతి సనన్ లీడ్​ రోల్స్​లో నటించిన మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్'. జూన్ 16న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంటోంది. అయినప్పటికీ తొలిరోజు మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు బాక్సాఫీస్​ వద్ద క్రమ క్రమంగా ఢీలా పడిపోతూ వస్తోంది. తొలి రోజు ఈ సినిమా రూ.140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్​ను అందుకోగా.. తర్వాతి రెండు రోజులు కూడా రోజుకు రూ.100 కోట్లు అందుకొని మొదటి వీకెండ్ కంప్లీట్​ అయ్యేసరికి రూ.340 కోట్ల గ్రాస్ దాటగలిగింది.

Adipurush Collections : ఇక సోమవారం నుంచి ఈ కలెక్షన్స్‌‌లో మార్పులు వచ్చాయి. ఆరో రోజు వరల్డ్ వైడ్ కేవలం రూ.15 కోట్లు మాత్రమే వసూలయ్యాయని ట్రేడ్​ వర్గాల టాక్​. ఇక వరల్డ్​వైడ్​ ఈ సినిమా కలెక్షన్​ రూ.410 కోట్లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.77.53 కోట్ల మేర వసూలు సాధించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా బ్రేక్​ ఈవెన్​కు రావాలంటే ఇంకా రూ.66.24 కోట్లు రాబట్టాల్సి ఉంటుందని సినీ వర్గాల టాక్​. వారం మొదట్లోనే ఇలా ఢీలా పడ్డా ఫలితాలను చూసిన విశ్లేషకులు.. వీకెండ్స్​లో ఈ సినిమా కలెక్షన్స్​ వేగం పుంజుకుంటే కానీ అనుకున్న టార్గెట్​ను సాధించలేమని అంటున్నారు.

'ఎదుటి వారి భావోద్వేగాలను మనం అర్థం చేసుకోవాలి'
Kriti Sanon Mother Post : మరోవైపు ఈ సినిమా గురించి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో పలు అంశాలను చిత్రీకరించిన విధానంపై సోషల్​ మీడియాలో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. కొన్ని పాత్రలు, డైలాగ్స్‌పై ప్రేక్షకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా సినిమాను బ్యాన్​ చేయాలంటూ నిరసనలు సైతం జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కృతి సనన్ తల్లి గీతా సనన్ స్పందించారు. సోషల్​ మీడియాలో ఓ పోస్ట్​ పెట్టి 'ఆదిపురుష్​'కు మద్దతు తెలిపారు.

'ప్రజలు ఒక నిర్దిష్ట విషయాన్ని మంచి మనస్తత్వంతో పాటు, ఆలోచనలతో చూడాలి. మనం సరైన దృక్పథంతో చూసినప్పుడే మనకు ప్రపంచం అందంగా కనిపిస్తుంది. మనకు భగవంతుడు రాముడు ప్రేమను పంచమని ప్రజలకు బోధించాడు. శబరి రామునికి అందించిన ప్రేమను చూడాలి కానీ.. ఆ వ్యక్తి తప్పులను చూడకూడదు. ఎదుటి వారి భావోద్వేగాలను మనం అర్థం చేసుకోవాలి. జై శ్రీరామ్' అంటూ పోస్ట్ చేశారు. అయితే ఈమె పెట్టిన పోస్ట్​ పై కూడా నెట్టింట తీవ్ర ట్రోల్స్​ మొదలయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.