ETV Bharat / entertainment

పాపులర్ లిస్ట్​లో రామ్​చరణ్ టాప్ ప్లేస్.. పడిపోయిన కోహ్లీ బ్రాండ్ వాల్యూ

మెగా పవర్​ స్టార్​ రామ్ ​చరణ్​ మరో ఘనత సాధించారు. ఐడీఎమ్​బీ​ విడుదల చేసిన పాపులర్​ ఇండియన్​ సెలెబ్రిటీల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. యంగ్​ టైగర్​ జూనియర్​ ఎన్టీఆర్​, దీపికా పదుకొణె, ఆలియా భట్​ తర్వాతి స్థానాలు దక్కించుకున్నారు. మరోవైపు టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ ఓ విషయంలో రివర్స్ గేర్ వేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Ram Charan tops Popular Indian Celebrities list

author img

By

Published : Mar 21, 2023, 7:33 PM IST

Updated : Mar 21, 2023, 7:51 PM IST

'ఆర్​ఆర్​ఆర్​'తో​ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు మెగా పవర్​ స్టార్​ రామ్ ​చరణ్​. 'నాటు నాటు..' పాటతో ఆస్కార్​ వరకు వెళ్లారు. తాజాగా ఈ నటుడు మరో ఘనత సాధించారు. ఐడీఎమ్​బీ విడుదల చేసిన 'పాపులర్​ ఇండియన్ సెలెబ్రిటీస్​' జాబితాలో ఈ వారానికి గానూ మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ జాబితాలో రామ్​ చరణ్​ తర్వాతి రెండు స్థానాల్లో బాలీవుడ్ అందాల భామలు దీపికా పదుకొణె, ఆలియా భట్​ నిలిచారు. నాల్గో ప్లేస్​లో నిమ్రత్​ కౌర్, ఐదో స్థానంలో ప్రియా బెనర్జీ, ఉన్నారు. మరో ఆర్​ఆర్​ఆర్​ స్టార్ యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ ఆరో ప్లేస్​ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని రామ్​ చరణ్ భార్య ఉపాసన సోషల్​ మీడియా వేదికగా పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఇన్​స్టాలో ఓ స్టోరీ పెట్టి.. "ప్రస్తుతం నా జీవితంలో #1 ట్రెండింగ్‌ అవుతోంది" అంటూ రాసుకొచ్చారు.

Ram Charan tops Popular Indian Celebrities list
ఉపాసన షేర్​ చేసిన ఫొటో

ఇటీవలే ఆస్కార్​లో మెరిసిన రామ్​ చరణ్​ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న ఆర్​సీ 15 సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి దిగ్గజ డైరెక్టర్​ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ​రామ్​చరణ్​ సరసన కియారా అడ్వాణీ ఆడిపాడనుంది.

పడిపోయిన విరాట్​ కోహ్లీ 'విలువ'..
మరోవైపు.. మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీ లిస్ట్​లో ప్రముఖ బాలీవుడ్​ నటుడు రణ్​వీర్​ సింగ్.. క్రికెటర్ విరాట్ కోహ్లీని వెనక్కు నెట్టి.. భారత్​లో అత్యంత విలువైన సెలెబ్రిటీగా అవతరించాడు. 2022లో కోహ్లీ కనబర్చిన పేలవ ప్రదర్శనే.. అతడి బ్రాండ్​ విలువ పడిపోవడానికి కారణమని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాని వల్ల 2021లో 185.7 మిలియన్​ డాలర్లుగా ఉన్న అతడి బ్రాండ్​ వాల్యూ.. 176.9 మిలియన్లకు పడిపోయినట్ల సమాచారం. అయితే ఈ వాల్యూ 2020లో 237.7 యూఎస్​ డాలర్లుగా ఉండేదని సమాచారం. ఈ మేరకు క్రోల్ అనే కన్సల్టింగ్​ సంస్థ నివేదిక విడుదల చేసింది.

2021లో బాలీవుడ్​ సూపర్​ స్టార్​ అక్షయ్​ కుమార్​ను నెట్టి రెండో స్థానానికి ఎగబాకిన రణ్​వీర్​ సింగ్​.. ఇప్పుడు కొహ్లీని అధిగమించి మొదటి ప్లేస్​ సొంతం చేసుకున్నాడు. అతడికి ఉన్న ఎండోర్స్​మెంట్​(ప్రకటనలు) పోర్టుఫోలియో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు కారణంగానే ఈ మొదటి దక్కించుకున్నాడని క్రోల్​ మేనేజింగ్​ డైరెక్టర్​ అవిరల్​ జైన్​ తెలిపారు. దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి అల్లు అర్జున్​ (31.4 మిలియన్​ యూఎస్​ డాలర్లు), రష్మిక మందాన (25.3 మిలియన్​ యూఎస్ డాలర్లు) టాప్​ 25 జాబితాలో చోటు సంపాదించారు.

80.3 మిలియన్​ డాలర్ల బ్రాండ్​ విలువతో టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్ ధోనీ ఆరు, సచిన్​ తెందూల్కర్​ 8వ ప్లేస్​​లో ఉన్నారు. బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్ 55.7 మిలియన్​ డాలర్లతో 10 స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి ప్లేస్​లో ​54.5 మిలియన్​ డాలర్లతో సల్మాన్​ ఖాన్​ నిలిచారు. ఒలింపిక్​ గోల్డ్​ మెడలిస్ట్​ నీరజ్​ చోప్రా 26.5 మిలియన్​ డాలర్ల బ్రాండ్​ వాల్యూతో టాప్​ 25 జాబితాలో స్థానం దక్కించుకున్నారు. మహిళల్లో 102.9 మిలియన్​ డాలర్లతో ఆలియా భట్​ మొదటి ప్లేస్​లో నిలిచింది. ఈమె బ్రాండ్ విలువ 2021లో 68.1 మిలియన్​ డాలర్ల నుంచి 2022లో 102.9 మిలియన్​ డాలర్లకు ఎగబాకింది.

Last Updated : Mar 21, 2023, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.