ETV Bharat / entertainment

పవన్ మళ్లీ ఏమైంది.. థాయ్​లాండ్​కు పవర్​స్టార్​.. కన్ఫ్యూజన్​లో 'ఉస్తాద్'​ - 'ఓజీ' రిలీజ్! - పవన్ కల్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ డేట్​

Pawan Kalyan Upcoming Projects : పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ, ఉస్తాద్ భగత్ మళ్లీ యూటర్న్ తీసుకున్నట్లు తెలిసింది. ఆ వివరాలు..

Pawan Kalyan Upcoming Projects
మళ్లీ కన్ఫ్యూజన్​లో 'ఉస్తాద్'​ - 'ఓజీ'.. థాయ్​లాండ్​కు పవన్​
author img

By

Published : Aug 21, 2023, 11:44 AM IST

Pawan Kalyan Upcoming Projects : ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'బ్రో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన చేతిలో క్రిష్​ 'హరి హర వీరమల్లు', హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' ఉన్నాయి. అయితే ఈ చిత్రాల విషయంలో మళ్లీ కన్ఫూజన్​ మొదలైంది. మొన్నటి వరకు పాలిటిక్స్​ షెడ్యూల్ వల్ల ఈ చిత్రాలు ఆగిపోయినట్టు ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత పవన్ మనసు మార్చుకుని ఈ చిత్రాల షూటింగ్​ను మొదలుపెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఉస్తాద్​ను సంక్రాంతికి(pawan kalyan ustaad bhagat singh), ఓజీని డిసెంబర్​లో రిలీజ్​ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇన్​సైడ్ టాక్ వినిపించింది.

అయితే ఇప్పుడు ఈ రెండు చిత్రాలు డిసెంబర్, జనవరిలో రిలీజ్​ కావని, అప్పటికల్లా సిద్ధం చేయడం కష్టమని తెలిసింది. కానీ షూటింగ్​ మాత్రం మొదలు పెట్టాలని అనుకంటున్నారు. రాబోయే రెండు మూడు నెల్లలో చిత్రీకరణ ప్రారంభించి కొనసాగిస్తారని తెలిసింది. దీనివల్ల ఈ ఇద్దరు దర్శకులు సినిమాను మరింత క్వాలిటీగా తీర్చిదిద్దేందుకు మరింత సమయం దొరికినట్టైంది.

Pawan Kalyan OG Movie : పవన్ తొలిసారి... పవన్​ రీఎంట్రీ ఇచ్చాక ఇప్పటివరకు వకీల్​సాబ్​, భీమ్లానాయక్​, బ్రో సినిమాలను చేశారు. వీటిలో ఏదీ కూడా ఫారెన్​ షెడ్యూల్​ను జరుపుకోలేదు. అన్నీ లకల్​గానే చేశారు. అయితే ఇప్పుడు ఓజీ కోసం ఫారెన్ షెడ్యూల్​ చేయబోతున్నారని తెలిసింది. మొన్నటివరకు ముంబయిలో షూటింగ్​ జరుపుకున్న ఈ చిత్రం.. అక్టోబర్​లో మాత్రం థాయ్​లాండ్​లో చిత్రీకరణ జరుపుకునేందుకు సిద్ధమైందని తెలిసింది. 30 రోజులు పాటు ఈ షెడ్యూల్ ఫారెన్​లో కొనసాగనుందని తెలిసింది. దీని కోసం పవన్​ థాయ్​లాండ్ వెళ్లనున్నారని తెలిసింది. ​

మరో వార్త ఏంటంటే.. ఈ చిత్రంలో పవర్ ఫుల్ ఇంట్రోను ప్లాన్ చేశారని తెలిసింది. రెండు పవర్​ఫుల్ ఇంట్రో సీన్స్​ను దర్శకుడు సుజీత్ డిజైన్ చేశారట. అయితే ఆ రెండింలో పవన్​.. 15నిమిషాల హై ఓల్టేజ్​ యాక్షన్ ప్యాక్డ్​ ఎంట్రీ సీన్​ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఇది అభిమానులకు గూస్​ బంప్స్​ తెప్పించేలా ఉంటుందట. ఇప్పటి వరకు పవన్ కెరీర్​లోనే బెస్ట్ ఇంట్రడక్షన్ ఇంట్రో యాక్షన్​ సీక్వెన్స్​గా చిత్రీకరించనున్నారని తెలిసింది. ఇక ఈ సినిమాకు తమన్ అందించబోయే సంగీతం, బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​ హైలైట్​గా నిలవనుందట.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.