పవన్ కల్యాణ్- హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. గబ్బర్ సింగ్‌తో హిట్ కొట్టిన ఈ కాంబో దాదాపు 12 ఏళ్ల తర్వాత మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రాబోతుంది. దాదాపు రెండేళ్ల క్రితం సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏ మాత్రం అప్డేట్స్ రాని ఈ సినిమా.. ఇప్పుడు(ఏప్రిల్ 5) సెట్స్‌పైకి వెళ్లడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 'గబ్బర్ సింగ్' రోజులు మళ్లీ రానున్నాయంటూ తెగ సంబరాలు చేసుకుంటున్నారు.
దర్శకుడు హరీశ్ శంకర్ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లిందంటూ తెలుపుతూ.. పవన్‌కు సంబంధించిన ఓ సాలిడ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి సోషల్‌మీడియాను షేక్ చేశారు. ఓ చేతిలో టీ గ్లాస్.. మరో చేతిలో రివాల్వర్ పట్టుకున్న పవన్ కల్యాణ్ పోలీస్ డ్రెస్‌లో స్టైలిష్‌గా ఓ కుర్చీలో కిటికీ వైపు తిరిగి కూర్చున్నట్లు కనిపించారు. 'This Time it's not just entertainment' ఈ సారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు.. అంటూ రిలీజైన పోస్టర్‌పై వ్యాఖ్య రాసుకొచ్చింది మూవీ టీమ్.
అయితే ఓ సారి పోస్టర్‌ను పరిశీలిస్తే పలు ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లో ఓ వైపు భగత్ సింగ్ ఫోటో ఉండగా మరో వైపు గోడపై 'కాప్ కనెక్ట్.. పోలీసులకు ఓ కొత్త యాప్' అనే పోస్టర్ అతికించి ఉంది. మరోవైపు డ్రెస్సింగ్ స్టైల్ చూస్తుంటే సేమ్ గబ్బర్సింగ్లానే ఉంది. అదే పాత యాటిట్యూడ్‌తో పోస్టర్లో పవన్ కనిపించారు. అంటే ఈ సినిమా గబ్బర్ సింగ్‌కు సీక్వెలా? అసలు ఈ 'కాప్ కనెక్ట్' ఏంటి? అనే సందేహాలు వస్తున్నాయి.
-
The POWER HOUSE has arrived to set ablaze USTAAD sets ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) April 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
ఉస్తాద్ ఊచకోత షురూ 💥#UstaadBhagatSingh shoot begins 🔥@PawanKalyan @harish2you @ThisIsDSP @DoP_Bose #AnandSai @UBSTheFilm pic.twitter.com/46Arw8lssq
">The POWER HOUSE has arrived to set ablaze USTAAD sets ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) April 5, 2023
ఉస్తాద్ ఊచకోత షురూ 💥#UstaadBhagatSingh shoot begins 🔥@PawanKalyan @harish2you @ThisIsDSP @DoP_Bose #AnandSai @UBSTheFilm pic.twitter.com/46Arw8lssqThe POWER HOUSE has arrived to set ablaze USTAAD sets ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) April 5, 2023
ఉస్తాద్ ఊచకోత షురూ 💥#UstaadBhagatSingh shoot begins 🔥@PawanKalyan @harish2you @ThisIsDSP @DoP_Bose #AnandSai @UBSTheFilm pic.twitter.com/46Arw8lssq
సైబర్ క్రైమ్ నేపథ్యంలో..
'కాప్ కనెక్ట్' అంటే ఓ మొబైల్ ఎక్స్‌క్లూజివ్ యాప్. ఈ యాప్.. సైబర్ క్రైమ్ కేసుల్లో దర్యాప్తు చేయడానికి టెక్నికల్‌గా, లీగల్‌గా పోలీసు అధికారులకు, లాయర్స్, సీఐఎస్ఓ అధికారులకు ఉపయోగపడుతుంది. అంటే దీని బట్టి పవన్.. హై రేంజ్లో జరిగే సైబర్ క్రైమ్ కేసులను ఛేదించే అధికారిగా కనిపించే అవకాశముందని సినీ అభిమానులు అంటున్నారు. అంటే కథ మొత్తం సైబర్ క్రైమ్ చుట్టే తిరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.
కామెడీ మాత్రమే కాదు..
దీనికి తోడు క్యాప్షన్ కూడా ఈ సారి కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు అని క్లారిటీ కూడా ఇచ్చారు. అంటే దాని అర్థం.. గతంలో 'గబ్బర్ సింగ్' సినిమాను చూస్తే కథ మొత్తం ఓ రూరల్(గ్రామీణ) బ్యాక్‌గ్రౌండ్ నేపథ్యంలో నడుస్తుంది. ఇందులో పవన్.. ఓ పక్కా మాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తూ సినిమా మొత్తం పవర్ఫుల్ డైలాగ్‌లు చెబుతూనే మరోవైపు కామెడీని బాగా పండించారు. ఫైనల్‌గా ఆ ఊరులో ఉన్న ఓ లోకల్ గుండాను ఎదిరించి చివరికి మట్టికరిపిస్తారు.
అయితే ఈ సినిమా విజయం సాధించడంలో కామెడీనే ప్రధాన పాత్ర పోషించిందని చెప్పాలి. కానీ ఈ సారి పోస్టర్లో ఎంటర్టైన్మెంట్ కోసం కాదని రాయడం వల్ల.. ఈ సారి స్టైలిష్ మోడ్‌లో సాగే యాక్షన్ కథ అని తెలుస్తోంది. పవన్ కూడా 'గబ్బర్ సింగ్'లో లాగా పూర్తిగా మాస్‌గా కాకుండా.. మాస్‌ను టచ్ చేస్తూనే క్లాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించే అవకాశాలు ఉన్నాయి!